MAA President: అంత గొడవ తర్వాత.. ఇప్పుడు అందరినోటా ‘ఏకగ్రీవం’ మాట..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సృష్టించిన మాటల యుద్ధం.. మామూలుది కాదు.

MAA President: అంత గొడవ తర్వాత.. ఇప్పుడు అందరినోటా ‘ఏకగ్రీవం’ మాట..!

Maa

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సృష్టించిన మాటల యుద్ధం.. మామూలుది కాదు. ఎన్నికలకు 3 నెలల ముందే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించిన దగ్గర మొదలైన ఈ ఫైటింగ్.. చివరికి ‘మా’ ఎన్నికల్లో ఓటమి కారణంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసేవరకు వెళ్లింది. లోకల్ నాన్ లోకల్ వివాదంతో పాటు.. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా వరకూ.. MAA ఎన్నికలపై ప్రభావం చూపించాయి. ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా అన్నంత అభిప్రాయం సాధారణ ప్రజల్లోనూ కలిగేంతవరకూ ఈ పరిణామాలు ప్రభావం కలిగించాయి.

ఇంత జరిగిన తర్వాత.. టాలీవుడ్ పెద్దలు, సీనియర్లు ఈ విషయంపై సుతిమెత్తగా తమ అభిప్రాయాలు బయటపెడుతున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే తన కుమారుడి విజయంపై ఉప్పొంగిన మోహన్ బాబు.. మీడియాతో మాట్లాడారు. ఇకపై.. MAA ఎన్నికలు ఏకగ్రీవం అయితేనే బాగుంటుందని కామెంట్ చేశారు. ఇకపై ఇలాంటి గొడవలు జరక్కుండా ఉంటే బాగుంటుందని చెప్పారు. తర్వాత.. MAA కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు సైతం మాట్లాడుతూ.. వివాదం ఇంత దూరం వచ్చి ఉండకూడదని అన్నారు. తామంతా ఒకే కుటుంబమని చెప్పారు. ఇకపై ఇలా జరక్కూడదని.. కోరుకున్నారు. ఇన్ డైరెక్ట్ గా ఏకగ్రీవాన్నే కోరుకున్నట్టు కామెంట్ చేశారు.

తాజాగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఈ విషయంపై స్పందించారు. ఇంతటి అలజడి.. చిత్ర పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. పెళ్లిసందD సినిమా ప్రమోషన్ కోసం విశాఖ వెళ్లిన రాఘవేంద్రరావు.. మీడియాతో మాట్లాడారు. సినిమా పెద్దలంతా కలిసి MAA అధ్యక్షుడిగా ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంచు విష్ణు.. MAA అధ్యక్షుడిగా రాణిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read More: MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’ లో ఎందుకింత వైరాగ్యం