RRR Movie : ఆర్ఆర్ఆర్ లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్, తగ్గేది లేదంటున్న చెర్రీ, జూ.ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని..ఇందులో చెర్రీ, జూ.ఎన్టీఆర్ ల నటన హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

RRR Movie : ఆర్ఆర్ఆర్ లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్, తగ్గేది లేదంటున్న చెర్రీ, జూ.ఎన్టీఆర్

RRR Movie

Underwater Action Scenes : టాలీవుడ్ లో అందరి చూపు ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్‘ (రౌద్రం, రణం, రుధిరం) సినిమాపైనే ఉంది. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టేకింగ్, మేకింగ్ విషయంలో ఈ దర్శక ధీరుడు అస్సలు రాజీపడరనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు నటిస్తున్నారు. యాక్టింగ్ విషయంలో ఎవరూ తగ్గేది లేదంటున్నారంట. పోటీ పడి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని..ఇందులో చెర్రీ, జూ.ఎన్టీఆర్ ల నటన హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి విజన్ కు తగ్గట్టే ఈ సీన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అనిపించారని ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్స్ కు థియేటర్స్ లో ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందని ఇండస్ట్రీ టాక్. తారక్ కీ, పులికి మధ్య ఓ ఫైట్ ఉంటుందనే తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతూ ఉండగా.. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించిన వీడియోలను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇటీవలే…కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులపై క్లైమాక్స్‌ షూట్ చేశారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ రంగంలోకి దిగారు. ‘గ్లాడియేటర్’, ది బోర్న్ ఐడెంటిటీ’, ‘2.0’, ‘ఎక్స్ -మెన్: ది లాస్ట్ స్టాండ్’ వంటి సినిమాలకు నిక్ పోవెల్ వర్క్ చేశారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు.