Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఏ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి..? ఏ సినిమాని ఎన్నాళ్లు చెయ్యాలి ..? ఎప్పుడు ఫినిష్ చెయ్యాలి..?

Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!

Prabhas

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఏ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి..? ఏ సినిమాని ఎన్నాళ్లు చెయ్యాలి ..? ఎప్పుడు ఫినిష్ చెయ్యాలి..? బాగా లెక్కలేసుకుని మరీ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆల్రెడీ ఆదిపురుష్ ని, సలార్ ని బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ .. నాగశ్విన్ సినిమాని కూడా ప్లాన్ ప్రకారం పట్టాలెక్కించాడు. రెండేళ్లకో సినిమా చేసే ప్రభాస్ ఈ సారి 4 సినిమాల్ని లైన్లో పెట్టాడు. ఏదో స్టోరీ బావుందని ఓకే చెప్పడం కాదు ..బాగా ప్లాన్ చేసి వాళ్లకి డేట్స్ ఇవ్వాలి.

Telugu Film Hero’s: థియేటర్లపై హీరోల ఫోకస్.. సొంతగా కట్టేసుకుంటున్న స్టార్లు!

మరి 4 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్లానింగ్ ఎలా ఉండి ఉండాలి..? ప్రభాస్ ప్రజెంట్ ఆదిపురుష్, సలార్ సినిమాల్ని బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాల షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న ప్రభాస్ .. నాగశ్విన్ సినిమా ప్రాజెక్ట్. కెని కూడా లైన్ లో పెట్టాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా షూట్ కోసం ప్రభాస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈప్రాజెక్ట్ .కె మూవీ కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు కాల్షీట్స్ ఇచ్చారు.

Drugs Case: నేడు ఈడీ ముందుకు తరుణ్.. విచారణ ముగుస్తుందా?

ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ నటిస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీ సైఫై ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఆదిపురుష్, సలార్ ని ప్యార్లల్ గా షూట్ చేస్తున్న ప్రభాస్ .. ఈ సంవత్సరం చివరి నాటికి ఏదో ఒక సినిమాని కంప్లీట్ చేసి.. నాగాశ్విన్ సినిమాలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించడానికి లుక్స్ కోసం ఆల్రెడీ సెర్చ్ స్టార్ట్ చేశారు నాగశ్విన్ . ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఓ కొలిక్కి రాగానే జనవరి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా నాగశ్విన్ సినిమాకి షిఫ్ట్ అవ్వాలని పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు ప్రభాస్.