Jai Bhim : టీచర్ మిత్ర క్యారెక్టర్‌కి స్పూర్తి ఈమే..

‘జై భీమ్’ లో టీచర్ క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో నుండి తీసుకున్నదే..

Jai Bhim : టీచర్ మిత్ర క్యారెక్టర్‌కి స్పూర్తి ఈమే..

Jai Bhim Teacher

Jai Bhim: ప్రాంతం, బాష ఏదైనా మనిషి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఒకటే.. ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చెయ్యాలంటే.. ఆ ప్రాంతానికి తగ్గట్లు మాతృకకు మార్పులు చేర్పులు చెయ్యాల్సి ఉంటుంది. కానీ మానవ సంబంధాలను, వారి బాధలను, ఒక ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనను చెప్పడానికి ఎలాంటి హద్దులు ఉండవు అని నిరూపించింది ‘జై భీమ్’ సినిమా..

Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..

విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జై భీమ్’ నవంబర్ 2న తెలుగ, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయింది. ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు జ్ఞానవేల్.

Jai Bhim : నిజాయితీగా తీస్తే నెత్తిన పెట్టుకుంటారు..

సినతల్లి క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఆకట్టుకోవడంతో సినిమాలో సినతల్లి రోల్ చేసిన లిజోమోల్ జోస్ తర్వాత నెటిజన్లు ఎక్కువగా రియల్ సినతల్లి గురించి సెర్చ్ చేశారు. ఈ కథ తమిళనాడులో నిజంగా జరిగింది అంటే చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. భర్త కోసం పార్వతి చేసిన పోరాటం మహిళలందరికీ స్పూర్తి అని కొనియాడుతున్నారు.
ఈ కథలో మరో కీలకమైన క్యారెక్టర్ టీచర్.

Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

‘జై భీమ్’ లో టీచర్ క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో నుండి తీసుకున్నదే. రజీషా విజయన్ టీచర్ మిత్ర పాత్రలో నటించింది. ఒరిజినల్ టీచర్ పేరు ఎన్.కన్నమ్మాళ్. తమిళనాడులోని పుదుకొట్టె జిల్లాకు చెందిన ఆమె 1981లో లెకకల టీచర్‌గా పని చేశారు.

Adipurush : పక్కా పాన్లింగ్.. అనుకున్న టైంకే ‘ఆదిపురుష్’

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపుకునోచుకోని గిరిజనుల పరిస్థితులు ఆమెను ఆలోచింపజేశాయి. పిల్లలకు, పెద్దలకు చదువు చెబుతూ వాళ్ల తరపున పోరాడేవారామె. క్రమంగా ఆమె పోరాటం ‘అరివోలి ఇయక్కమ్’ ఉద్యమంగా మారింది.

Annaatthe : 200 కోట్ల దిశగా రజినీ సినిమా! ఇదీ సూపర్‌స్టార్‌ స్టామినా..

1991 నాటికి కన్నమ్మాళ్‌తో సుమారు 30 వేలమంది వాలంటీర్లుగా చేరారు. వీళ్లంతా టీచర్లుగా మారి గిరిజనుల గూడాలకు వెళ్లి.. చదువు, స్కిల్స్ నేర్పించేవారు. ఉదయం 11 గంటలలోపే క్లాసులు ముగించి, తిరిగి రాత్రి 7 గంటల తర్వాత స్టార్ట్ చేసేవారు. ఇలా పదేళ్లలో 2 లక్షల 40 వేల మందికి చదువులు చెప్పారు. 1992లో తమిళనాడు ప్రభుత్వం పుదుకొట్టై జిల్లాను పూర్తి లిటరసీ జిల్లాగా ప్రకటించింది.

Mohanal : ‘మాన్‌స్టర్’ గా మోహన్ లాల్.. లుక్ అదిరిందిగా..