Baahubali : అసలు ‘బాహుబలి’ వీళ్లు చెయ్యాల్సింది తెలుసా..!

రాజమౌళి ‘బాహుబలి’ రిజెక్ట్ చేసిన నటీనటులు వీళ్లే..

Baahubali : అసలు ‘బాహుబలి’ వీళ్లు చెయ్యాల్సింది తెలుసా..!

Unknown Facts About Behind The Scenes Of Baahubali

Baahubali: ‘బాహుబలి : ది బిగినింగ్’.. ‘బాహుబలి : ది కన్ క్లూజన్’.. రెండు పార్టులు తెలుగు సినిమా స్థాయిని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సినిమాలు.. అప్పటివరకు భారీ రేంజ్ గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ మూవీస్ మాత్రమే అనుకునే వారంతా.. హాలీవుడ్ వాళ్లకి టాలీవుడ్ టాలెంటెడ్ పర్సన్స్ ఏమాత్రం తీసిపోరు అని నిరూపించిన విజువల్ వండర్ ‘బాహుబలి’..
దాదాపు 5 ఏళ్ల పాటు రాజమౌళి అండ్ టీం.. డే అండ్ నైట్ కష్టపడి ప్రతి ఫ్రేమ్‌ని ఒక శిల్పంలా చెక్కారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, భల్లాలదేవ, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక క్యారెక్టర్లు సినిమాకు మెయిన్ పిల్లర్. అలాగే ఆ పాత్రల్లో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నాలను తప్ప మిగతా వారిని ఊహించుకోలేం.
అయితే ‘బాహుబలి’ కోసం జక్కన్న వీళ్ల కంటే ముందు ఈ రోల్స్ కోసం కొందరు పాపులర్ నటీనటులను అప్రోచ్ అవగా వారంతా రిజెక్ట్ చేశారనే వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి ఏ క్యారెక్టర్ కోసం ఎవరెవర్ని సంప్రదించారో తెలుసా..!

‘బాహుబలి’ గా హృతిక్ రోషన్..
సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అయితే బాగుంటుందని కలిసి కథ చెప్పారట జక్కన్న. విని బాగుందని చెప్పిన హృతిక్ తర్వాత స్పందించలేదంట. కారణం ఏంటంటే ‘జోధా అక్బర్’ చేసుండడంతో మరో పీరియాడిక్ ఫిలింలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట హృతిక్.. కట్ చేస్తే రెబల్ స్టార్ రెండు క్యారెక్టర్లను తను తప్ప ఎవరూ చెయ్యలేరు అనేంతగా చేసి మెప్పించారు.

Hrithik Roshan

భల్లాలదేవుడిగా జాన్ అబ్రహాం..
అధికార దాహంతో, అన్న మీద కోపంతో రగిలిపోయే భల్లాలదేవ రోల్ జాన్ అబ్రహాంను అనుకున్నారు. సౌత్ ఇండియాలో బాలీవుడ్ బిగ్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడివారితో బిగ్ స్కేల్‌లో సినిమా చేద్దామనుకుని రాజమౌళి, భల్లాలదేవ క్యారెక్టర్ జాన్‌కి చెప్పగా అతను రిజెక్ట్ చేశాడు. రానా ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేశాడో చెప్పక్కర్లేదు.

John Abraham

శివగామిగా శ్రీదేవి..
‘బాహుబలి’ లో డైనమిక్ లేడీ క్యారెక్టర్ ‘శివగామి’.. ఈ పాత్ర కోసం అతిలోక సుందరి శ్రీదేవిని కలిసి కథ చెప్పడం. ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం కారణంగా రమ్యకృష్ణను ఫిక్స్ చేశామని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు.

Sridevi

కట్టప్పగా కంప్లీట్ యాక్టర్..
మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజకుటుంబానికి నమ్మిన బంటుగా కట్టప్ప క్యారెక్టర్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. రాజమౌళి ముందుగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్‌కు కట్టప్ప క్యారెక్టర్ చెప్పారని సమాచారం. ఇక సత్యరాజ్ ఆ పాత్రలో జీవించేశారు. కట్టప్ప అంటే సత్యరాజ్ అనేంతగా తనదైన ముద్ర వేశారు..

Mohanlal

సోనమ్ కపూర్..
శివగామి, దేవసేన తర్వాత అంతంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అవంతిక. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌ను సంప్రదిచంగా రిజెక్ట్ చేశారట. నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ఓ సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్న సోనమ్.. తనకు ‘బాహుబలి’ లో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినట్లు చెప్పింది కానీ ఏ రోల్ అనేది రివీల్ చెయ్యలేదు.. కానీ అవంతిక క్యారెక్టర్ కోసమే జక్నన్న ఆమెను అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది..

Sonam Kapoor