Unni P Rajan: అనుమాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి

ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్‌ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. బుధవారం రాత్రి ఉన్నిరాజన్‌ భార్య ప్రియాంక తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు.

Unni P Rajan: అనుమాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి

Actor

Unni P Rajan: ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్‌ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. బుధవారం రాత్రి ఉన్నిరాజన్‌ భార్య ప్రియాంక తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు.

వరకట్నం కేసు పెట్టిన మరుసటి రోజే ప్రియాంక మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త ఉన్నిరాజన్ పీ దేవ్‌ తమ కూతురిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నదని ఆరోపిస్తున్నారు ప్రియాంక తల్లిదండ్రులు.

పెళ్ళైన కొద్దీ రోజులకే వరకట్నం తేవాలని వేధించేవాడని, ఉన్ని రాజన్ ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, తమ కూతురు ప్రియాంకని ఎన్నో బాధలు పెట్టాడని, కానీ ఆమె మొదట్లో తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి సమయంలో ప్రియాంకకు పెట్టిన నగలు మొత్తం అమ్మేశాడని, అవి అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడని తెలిపారు.

అనేక సార్లు తన కూతురికి డబ్బు ట్రాన్స్ఫర్ చేశానని తన అవసరం కోసమని తీసుకోని భర్తకు ఇచ్చేదని ప్రియాంక తల్లి అన్నారు. అయితే పదేపదే డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో అతడి నైజం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు.

కాగా 2019లో ఉన్ని రాజన్ – ప్రియాంక ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అయినా కొన్నాళ్లకే వీరి మధ్య కలహాలు వచ్చినట్లు ప్రియాంక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డబ్బు కోసమే తమ కూతురిని వివాహం చేసుకున్నాడని, చిత్ర హింసలకు గురిచేసేవాడని ఆరోపిస్తున్నారు.

మొదట్లో భర్త పెట్టె ఇబ్బందులు ప్రియాంక తమకు చెప్పలేదని టార్చర్ ఎక్కువ కావడంతో జరిగిన విషయం చెప్పిందని ఆమె తల్లి మీడియాకు తెలిపారు. శారీరక హింసకు పాల్పడిన వీడియోలు కూడా తమ దగ్గర ఉన్నాయని ప్రియాంక తల్లి చెబుతుంది. కాగా ఉన్నిరాజన్ పీ దేవ్‌, ప్రముఖ మలయాళ నటుడు దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. రాజన్ పీ దేవ్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోను ఎన్టీఆర్ అది సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు.