Unstoppable 2: పవన్ పవర్ ఎపిసోడ్‌కు సూపర్ రెస్పాన్స్.. ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..!
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్-2 పవర్ ఎపిసోడ్ ఎట్టకేలకు నిన్న రాత్రి 9 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంపై స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఈ రెండో సీజన్ ముగింపుగా వచ్చిన ఈ ఎపిసోడ్ తొలి భాగంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రావడంతో ఈ ఎపిసోడ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Unstoppable 2: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్-2 పవర్ ఎపిసోడ్ ఎట్టకేలకు నిన్న రాత్రి 9 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంపై స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఈ రెండో సీజన్ ముగింపుగా వచ్చిన ఈ ఎపిసోడ్ తొలి భాగంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రావడంతో ఈ ఎపిసోడ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.
Pawan Kalyan : అడిగినంత ఇవ్వరు.. సినిమా రెమ్యునరేషన్స్ గురించి బయటపెట్టిన పవర్ స్టార్..
ఇక ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రావడంతోనే ఒక్కసారిగా అందరూ ఆహా యాప్‌లో దీన్ని వీక్షించేందుకు ఆసక్తిని చూపారు. ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో బాలయ్య ఎలాంటి ముచ్చట పెట్టాడా.. బాలయ్య ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడా అని అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలోనే ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్ అప్పుడే రికార్డుల మొత మోగించేస్తోంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకున్నట్లుగా ఆహా నిర్వాహకులు తెలిపారు.
ఇలా ఈ టాక్ షోకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని తాము ముందుగానే ఊహించామని.. అందుకు తగ్గట్టుగానే ఈ ఎపిసోడ్‌కు ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్’ అనే ట్యాగ్ ఇచ్చామని ఆహా నిర్వహాకులు తెలిపారు. ఇక ఈ టాక్ షో ఎపిసోడ్‌ను సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రెండింగ్ చేస్తుండటంతో అన్‌స్టాపబుల్-2 షో కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా, త్వరలోనే ఈ ఎపిసోడ్‌కు చెందిన రెండో భాగాన్ని కూడా స్ట్రీమింగ్ చేస్తామని షో నిర్వాహకులు తెలిపారు.
#PawanKalyanOnAHA Black sokka esaadu ante bomma blockbuster eh?
100 million streaming now✌?#UnstoppableWithNBKS2 Baap of all Episodes Streaming now. #NBKOnAHA #NandamuriBalakrishna @PawanKalyan #MansionHouse @tnldoublehorse @realmeIndia@Fun88India #ChandanaBrothers pic.twitter.com/rSkDQak2MX— ahavideoin (@ahavideoIN) February 3, 2023