Unstoppble : వరుసగా పవన్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్న ఆహా.. బాలయ్య-పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రొమో ఎప్పుడో తెలుసా??
అభిమానులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని.......

Unstoppble : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సూపర్ గా దూసుకుపోతుంది. ఫస్ట్ సీజన్ గ్రాండ్ గా హిట్ అయి ముగియగా ఇప్పుడు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా గ్రాండ్ గా ముగిస్తున్నారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. అసలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా షోలో కలుస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ అన్‌స్టాపబుల్ షో ద్వారా ఇది సాధ్యమైంది.
బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేస్తుంటే వాళ్లకి తగ్గట్టు ఆహా కూడా వరుసగా గ్యాప్ లేకుండా అభిమానులకు ఏదో ఒక ట్రీట్ ఇస్తూనే ఉంది. ప్రోమోలు, పోస్టర్స్ తో హడావిడి చేస్తుంది ఆహా. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది.
Indian 2 : సౌత్ ఆఫ్రికాకు పయనమైన లోకనాయకుడు.. ఇండియన్ 2 షెడ్యూల్..
ఈ ఎపిసోడ్ ఆద్యంతం బాలయ్య – పవన్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. దీంతో అభిమానులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తామని ఆహా ఓ స్పెషల్ పోస్టర్ తో ప్రకటించింది. ఓ పోస్టర్ ని షేర్ చేస్తూ..బాప్ అఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 1 కి పగిలిపోయే రికార్డ్స్ జాతర జరిగిడినది. భీమ్లా నాయక్ పవర్ సాక్షిగా, బద్రీనాథ్ పొగరు సాక్షిగా చెప్తున్నాం, పార్ట్ 2 తో సెన్సేషన్ డెఫినిషన్ మార్చడానికి మేము రెడీ. మీరు రెడీ నా? అని ట్వీట్ చేసింది ఆహా. దీంతో అభిమానులు ఈ ప్రోమో కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ కి లాస్ట్ ఎపిసోడ్. దీంతో ఈ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ని గ్రాండ్ గా ముగిస్తారని భావిస్తున్నారు.
Baap of all episodes Part 1 ki pagilipoye records jathara jarigidndhi. Bheemla Nayak power saakshiga, Badrinath pogaru sakshi ga chepthunnam, part 2 tho sensation definition marchadaniki memu ready⚡️. Meeru ready na?#PawanKalyanOnUnstoppable #PawanKalyanOnAha @PawanKalyan pic.twitter.com/TqpzQIOZnX
— ahavideoin (@ahavideoIN) February 4, 2023