Balakrishna: ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మమొగుడు ‘అన్‌స్టాపబుల్’ – బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో అంగరంగ వైభవంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రీరిలీజ్ వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తన పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Balakrishna: ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మమొగుడు ‘అన్‌స్టాపబుల్’ – బాలకృష్ణ

Unstoppable Is The Father Of All Talks Shows Says Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో అంగరంగ వైభవంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రీరిలీజ్ వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తన పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Veera Simha Reddy Trailer: వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య మార్క్ మాస్.. ఒంటి చేత్తో ఊచకోత!

ఇక ఈ సందర్భంగా బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో గురించి ప్రస్తావించారు. తాను సినిమాలు, రాజకీయాలకే పరిమితం అని కొందరు అనుకున్నారని.. వారందరికీ సమాధానం ఇచ్చే విధంగా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని.. ఇది ప్రపంచంలోని అన్ని టాక్ షోలకు అమ్మమొగుడిగా మారిందని బాలయ్య కామెంట్ చేశారు. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.

Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్‌కు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

కాగా వీరసింహారెడ్డి సినిమా విజయం సాధించాలని తాను కోరుకోవడం లేదని.. ఇది ఖచ్చితంగా విజయం అయ్యి తీరుతుందని బాలయ్య కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో అక్కడున్న వారు ఉత్సాహంతో ఊగిపోయారు. ఇక ఎన్టీఆర్ డీఎన్ఏ, కమల్ హాసన్ డీఎన్ఏ కలిస్తే ఎలా ఉంటుందో, వీరసింహారెడ్డి సినిమా అలా ఉండబోతుందని బాలయ్య చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరసింహారెడ్డి మూవీపై బాలయ్య ఈ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఎందుకు ఉన్నాడో ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.