Unstoppable Episode 3 Promo : బాలయ్యకి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన శర్వానంద్.. ఫుల్ రొమాంటిక్ ఎపిసోడ్ అవ్వుద్ది.. అస్సలు మిస్ అవ్వొద్దు..

బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రాగా వీటికి భారీగా స్పందన వచ్చింది. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఆహా బృందం. ఈ సారి యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.............

Unstoppable Episode 3 Promo : బాలయ్యకి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన శర్వానంద్.. ఫుల్ రొమాంటిక్ ఎపిసోడ్ అవ్వుద్ది.. అస్సలు మిస్ అవ్వొద్దు..

Unstoppable season 2 Episode 3 Promo released

Unstoppable Episode 3 Promo :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రాగా వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఆహా బృందం. ఈ సారి యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ప్రోమోలో.. రాగానే శర్వానంద్ బాలయ్యబాబుకి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గత ఎపిసోడ్ లో బాలయ్య రష్మిక తన ప్రజెంట్ క్రష్ అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో శర్వానంద్ రష్మికకి వీడియో కాల్ చేసి బాలయ్య బాబుతో మాట్లాడించారు. బాలయ్య ఫుల్ ఫిదా అయిపోయాడు. రష్మిక మాట్లాడుతుంటే ఫోన్ తీసుకొని గుండెల దగ్గర పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా అరుపులతో హోరెత్తించారు. శర్వానంద్, రష్మిక కలిసి ఇటీవల ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో కలిసి నటించారు. ఈ స్నేహంతోనే శర్వా కాల్ చేసి బాలయ్యకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఇక శర్వా, అడివి శేష్ కలిసి రన్ రాజా రన్ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సంగతులని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ పని చేసిన హీరోయిన్స్ గురించి మాట్లాడారు. శర్వా సినిమాల గురించి, హీరోయిన్స్ గురించి మాట్లాడారు. బాలయ్య ఓ హిందీ కవితతో అదరగొట్టారు. యాక్టింగ్ స్కిల్స్ కి మార్కులు ఇవ్వాలని బాలయ్య స్టార్ హీరోల పేర్లు చెప్పడంతో శర్వా షాక్ అయ్యాడు. తర్వాత ఇద్దరి పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. బాలయ్య అడిగిన ప్రశ్నకి అడివి శేష్ పూజ హెగ్డేతో మాత్రం కిస్ సీన్ వస్తే చేయను అన్నాడు. జాను సినిమా సమయంలో శర్వాకి జరిగిన పెద్ద యాక్సిడెంట్ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. ఒక గేమ్ కూడా ఆడించి అందులో వచ్చేవి నిజం అయితే బట్టలు ఇప్పేయాలి అనడంతో హీరోలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బాలయ్య, శర్వానంద్, అడివి శేష్ కలిసి ఊ అంటావా మామ ఊ ఊ అంటావా సాంగ్ కి రెచ్చిపోయి డ్యాన్సులు వేశారు.

Adipurush : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ పోస్ట్‌పోన్.. ఎందుకో??

యువ హీరోలతో కలిసి బాలయ్య ఈ ఎపిసోడ్ లో ఫుల్ గా రచ్చ చేసినట్టు అర్ధమవుతుంది. ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా హీరోయిన్స్, సినిమాలు, రొమాంటిక్ అంశాలు, పెళ్లిళ్ల గురించి మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ కచ్చితంగా రొమాంటిక్ ప్రశ్నలతో ఉండబోతోంది అని అనుకుంటున్నారు. దీంతో ఈ ప్రోమో బాగా వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 4 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది.