Unstoppable Season 2 : బాలయ్య బాబు-చంద్ర బాబు.. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు..

ఈ సారి సీజన్ ని గ్రాండ్ గా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న కొన్ని షూట్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. లోకేష్ కూడా ఈ ఎపిసోడ్ కి వచ్చినట్టు సమాచారం. చంద్రబాబు మొట్టమొదటి............

Unstoppable Season 2 : బాలయ్య బాబు-చంద్ర బాబు.. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు..

Unstoppable Season 2 first episode with chandrababu

Unstoppable Season 2 :  హీరో నుంచి యాంకర్ గా మారి ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు బాలయ్య బాబు. అభిమానులకే కాక తెలుగు ప్రేక్షకులందరికీ ఈ షో తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో సరదగా షోని తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. ఈ షో భారీ విజయం సాధించింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది ఆహా అన్‌స్టాపబుల్.

దీంతో బాలయ్య హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని కూడా ప్రకటించారు ఆహా నిర్వాహకులు. ఈ షో కోసం అంతా ఎదురు చూస్తున్నారు. నేడు విజయవాడలో ఈ షో లాంచింగ్ ఈవెంట్ ని అభిమానుల మధ్య గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇక ఇప్పటికే మొదటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సారి సినీ సెలబ్రిటీలతోనే కాక రాజకీయ నాయకులని కూడా తీసుకొస్తున్నారు.

SS Kanchi : పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి.. ఆదిపురుష్ పై రాజమౌళి సోదరుడు కౌంటర్..

ఈ సారి సీజన్ ని గ్రాండ్ గా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న కొన్ని షూట్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. లోకేష్ కూడా ఈ ఎపిసోడ్ కి వచ్చినట్టు సమాచారం. చంద్రబాబు మొట్టమొదటి సారి ఇలా ఓ షోకి రావడం, బాలయ్య చంద్రబాబుని హోస్ట్ చేయడంతో ఈ సారి షో పై మరిన్ని అంచనాలు పెరిగాయి. బాలయ్య అభిమానులు, టిడిపి కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది.