Unstoppable with NBK : బాలయ్య బాబుతో కలిసి మహేష్ బాబు వచ్చేది అప్పుడే..

 బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ NBk' ఆహా ఓటీటీలో అదరగొడుతుంది. పదవ ఎపిసోడ్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారని అనౌన్స్ చేశారు......

Unstoppable with NBK : బాలయ్య బాబుతో కలిసి మహేష్ బాబు వచ్చేది అప్పుడే..

Balayya Mahesh

Unstoppable with NBK :  బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ ఆహా ఓటీటీలో అదరగొడుతుంది. ఈ షోలో బాలకృష్ణ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. వచ్చిన గెస్టులతో బాలయ్య బాబు ఓ ఆట ఆడుకుంటూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ షో సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. IMDBలో 9.8 టాప్ రేటింగ్ తో నంబర్ 1 పొజిషన్ లో దూసుకుపోతుంది.

ఇప్పటికే ఈ షో 9 ఎపిసోడ్స్ ని పూర్తిచేసుకుంది. ఇప్పటి వరకు ఈ షోలో మంచు ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రాజమౌళి, కీరవాణి, రవితేజ, గోపీచంద్ మలినేని, లైగర్ టీం, రానా వచ్చారు. వీరందరితో కలిసి బాలకృష్ణ ఫుల్ ఎంజాయ్ చేస్తూ జనాల్ని కూడా ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షో 10వ ఎపిసోడ్ గా ఈ సీజన్ ని ముగించాలని చుస్తునారు. అందుకే పదవ ఎపిసోడ్ గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

Kidnap Drama : సినిమాకోసం తనని తానే కిడ్నాప్.. 30 లక్షలు ఇమ్మని తండ్రికి బెదిరింపు..

ఇప్పటికే పదవ ఎపిసోడ్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారని అనౌన్స్ చేశారు. ఇక ప్రేక్షకులు అభిమానులు ఈ లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు బాలయ్యబాబు కలిసి వచ్చే ఎపిసోడ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఆహా టీం. ఫిబ్రవరి 4న ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ లాస్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో మహేష్ అభిమానులు, బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు అంతా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.