Unstoppable: దసరాకు బాలయ్య డబుల్ ట్రీట్.. ఇక అన్‌స్టాపబుల్!

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకు ఎలాంటి రెస్పాన్స్ లభించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో....

Unstoppable: దసరాకు బాలయ్య డబుల్ ట్రీట్.. ఇక అన్‌స్టాపబుల్!

Unstoppable With Nbk To Start From Dasara

Unstoppable: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకు ఎలాంటి రెస్పాన్స్ లభించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కాగా, తొలి సీజన్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ షో అయిపోయాక, మళ్లీ సీజన్ 2 కోసం డిమాండ్ పెరిగింది. అభిమానులు బాలయ్య టాక్ షోను ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Unstoppable With NBK: గెట్ రెడీ.. మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్!

ఇక ఇటీవల ఆహా ఓటీటీ నిర్వాహకులు కూడా అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఉండబోతుందని చెబుతూ వస్తున్నారు. అయితే రీసెంట్‌గా బాలయ్య ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ షోకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో యాంకర్ అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి ఓ ప్రశ్న అడిగాడట. ఈ షో ఎప్పుడు మొదలు కాబోతుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు ‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే’ అంటూ బాలయ్య బదులిచ్చారు.

Unstoppable With NBK: బాలయ్యతో మెగాస్టార్ ఎపిసోడ్.. ఎందుకు వర్క్‌ఔట్ కాలేదంటే?

దీంతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఖచ్చితంగా ఉంటుందని.. దానికి కూడా బాలయ్యే హోస్ట్‌గా ఉంటాడనేది కన్ఫం అయ్యింది. అయితే ఈ టాక్ షోను అతి త్వరలో ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే, దసరా పర్వదినాన ఈ టాక్ షోను స్టార్ట్ చేస్తారని.. అంతేగాక ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిర్వాహకులు అంటున్నారు. మరి నిజంగా ఈ టాక్ షోకు చిరు వస్తారా లేదా.. అనేది కాలమే చెబుతుంది.