Upasana : చరణ్ బర్త్‌డే పార్టీలో ఉపాసన.. వైరల్ అవుతున్న ఉపాసన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు..
రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన హైలెట్ గా నిలిచింది. కొన్ని నెలల క్రితం ఉపాసన ప్రగ్నెంట్ అని అధికారికంగా ప్రకటించారు. దీంతో నిన్న పార్టీకి ఉపాసన..................

Upasana Baby Bump Photos an Videos goes viral appears in Ram Charan Birthday
Upasana : RRR సినిమా నాటు నాటు ఆస్కార్(Oscar) సాధించిన తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు కావడంతో మెగా పవర్ స్టార్(Mega Power Star) రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ ప్రైవేట్ ప్లేస్ లో మార్చ్ 27 చరణ్ పుట్టిన రోజున రాత్రి అనేకమంది సినీ సెలబ్రిటీల సమక్షంలో చరణ్ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు నాగార్జున ఫ్యామిలీ, వెంకటేష్, రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, విజయ్ దేవరకొండ, కాజల్ ఫ్యామిలీ, శ్రీకాంత్, అడివి శేష్, RRR టీం.. ఇలా అనేకమంది ఈ పార్టీకి విచ్చేశారు.
అయితే రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన హైలెట్ గా నిలిచింది. కొన్ని నెలల క్రితం ఉపాసన ప్రగ్నెంట్ అని అధికారికంగా ప్రకటించారు. అప్పుడే మెగా అభిమానులు, ప్రముఖులు ఈ జంటకు కంగ్రాట్స్ తెలిపారు. దీంతో నిన్న పార్టీకి ఉపాసన బ్లూ కలర్ టైట్ డ్రెస్ వేసుకొని రావడంతో తన బేబీ బంప్ క్లారిటీగా కనపడుతుంది. ఫొటోలు, వీడియోల్లో ఉపాసన బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో అవి వైరల్ గా మారాయి. ఉపాసన బేబీ బంప్ ఫొటోలతో క్యూట్ గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Chiranjeevi : చరణ్ బర్త్ డే పార్టీలో RRR టీంని సన్మానించిన చిరు..
ఇక ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఎంట్రీ ఇచ్చారు. చరణ్ ఉపాసన చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్లడంతో ఉపాసన, రామ్ చరణ్ వీడియో కూడా వైరల్ గా మారింది. మెగా అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తూ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Upasana Konidela Flaunts Her Baby Bump For The First Time at Ram Charan's Birthday Bash…#HBDRamCharan #UpasanaKonidela #RamCharan pic.twitter.com/yocddLghXJ
— 10Tv News (@10TvTeluguNews) March 28, 2023