Ram Charan : రామ్చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్గా చేసిన ఉపాసన.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్..
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సెలబ్రేషన్స్ నిన్న చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు అభిమానులు. ఇక చరణ్ భార్య ఉపాసన (Upasana) కూడా తన భర్త పుట్టినరోజుని అంగరంగా వైభవంగా నిర్వహించింది.

Upasana conducted Ram Charan birthday party with tollywood celebrities
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు ఈ ఏడాది చాలా ఘనంగా జరిగింది. RRR సినిమాతో నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఏ బాలీవుడ్ అయితే రామ్ చరణ్ ని విమర్శించిందో, అదే బాలీవుడ్ ఇప్పుడు చరణ్ ప్రశంసిస్తుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో పలు ప్రఖ్యాతి వేదికల పై స్థానం దక్కించుకుంటూ ఎంతోమంది స్టార్స్ కి అందని గౌరవం అందుకుంటున్నాడు. అసలు చిరంజీవి (Chiranjeevi) కొడుకు చిరంజీవి అవుతాడా? అన్న ప్రశ్న దగ్గర నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పే జవాబు దగ్గరకి వచ్చాడు.
ఇక ఇంతటి ఘనతలు అందుకున్న తరువాత ఈ ఏడాది రామ్ చరణ్ చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటాయి. మెగా అభిమానులు ఆరెంజ్ రీ రిలీజ్ చేసి, ప్రత్యేక బర్త్ డే సెలబ్రేషన్ పార్టీలు నిర్వహించి తమ అభిమాన హీరో పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకున్నారు. అలాగే RC15 టీం కూడా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి బర్త్ డేని మరింత స్పెషల్ చేశారు. గేమ్ చెంజర్ (Game Changer) అనే టైటిల్ ని పెట్టారు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) కూడా తన భర్త పుట్టినరోజుని అంగరంగా వైభవంగా నిర్వహించింది.
Ram Charan : రామ్చరణ్కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన అమిత్ షా.. పవన్ కళ్యాణ్ లేఖ!
నిన్న నైట్ గ్రాండ్ బర్త్ డే పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి టాలీవుడ్ లోని స్టార్స్ అంత కదిలి వచ్చారు. మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, విజయ్ దేవరకొండ, నిఖిల్, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేషు, కాజల్ అగర్వాల్, పలువురు దర్శకులు, సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యి సందడి చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.