Upasana : RRR సక్సెస్‌ని నా బేబీ కూడా ఎక్స్‌పిరెన్స్ చేస్తుంది.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ సతీమణి ఉపాసన.. అవార్డు గెలుచుకున్న ఆనందాన్ని పంచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.

Upasana : RRR సక్సెస్‌ని నా బేబీ కూడా ఎక్స్‌పిరెన్స్ చేస్తుంది.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్!

Upasana emotional tweet for rrr winning golden globe award

Upasana : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవార్డ్స్ లో RRR మూవీ.. బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీ నామినేషన్ లో నిలువగా, ‘నాటు నాటు’ సాంగ్ అవార్డుని కైవసం చేసుకొంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాల భైరవ ఇద్దరు కలిసి పాడారు.

RRR: ఆ మార్వెల్ సూపర్ హీరోల పాత్రల్లో నటించేందుకు సై అంటోన్న తారక్, చరణ్‌లు!

ఇక ఈ అవార్డు వేడుకలకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ క్రమంలోనే చరణ్ సతీమణి ఉపాసన.. అవార్డు గెలుచుకున్న ఆనందాన్ని పంచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. “ఆర్ఆర్ఆర్ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నా బిడ్డ కూడా RRR సక్సెస్‌ని ఎక్స్‌పిరెన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డుని గెలుచుకోవడం చాలా గర్వంగా ఉంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

కాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురి అంతా ఆస్కార్ పై ఉంది. ఇప్పటికే ఈ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ కింద ‘నాటు నాటు’ సాంగ్ నామినేషన్ లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఎలిజిబుల్ లిస్ట్ లో బెస్ట్ మూవీగా RRR రేస్ నిలిచింది. జనవరి 12 నుంచి 17 వరకు ఈ ఎలిజిబుల్ లిస్ట్ కి ఓటింగ్ ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవనున్నాయి. ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ లో నిలిచే అవకాశం ఉంది అంటున్నారు హాలీవుడ్ మీడియా మరియు ప్రతినిధులు.