Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపార కుటుంబంలో జన్మించినా.. సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాలు, వాళ్ళ వారసులతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇది మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ కూడా ఉపాసన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు.

Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!

Kanika Kapoor Marriage

Kanika Kapoor Marriage: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపార కుటుంబంలో జన్మించినా.. సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాలు, వాళ్ళ వారసులతో కూడా మంచి అనుబంధం ఉంది. ఇది మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ కూడా ఉపాసన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. అలాంటి ఉపాసన ఫ్రెండ్ లిస్టులో ఉన్న సింగర్ కనికా కపూర్. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా హిందీ వెర్షన్‌.. ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా అంటూ తన గాత్రంతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది సింగర్‌ కనికాకపూర్‌.

Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

కాగా, తాజాగా కనికా కపూర్ రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని కనికా పెళ్లాడింది. లండన్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన పాల్గొని సందడి చేశారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఉపాసన.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. కనికా ఉపాసనకు చాలాకాలంగా స్నేహితురాలు కాగా.. గతంలో కూడా ఈ ఇద్దరూ పలు సందర్భాలలో కలిసి అకేషన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.

Upasana : పేపర్స్ విసురుతూ థియేటర్లో హంగామా చేసిన ఉపాసన

ఇక కనికా పెళ్లి విషయానికి వస్తే.. ఆమెకి ఇంతకు ముందే పెళ్లి అయింది. 1988లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోగా.. 24 ఏళ్ల తర్వాత 2012లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉండగా ఇప్పుడు లండన్ కు చెందిన వ్యాపార వేత్తను పెళ్లాడారు. కనికా పాటల విషయానికి వస్తే.. రాగిణి, ఎంఎంఎస్‌ సినిమా పాటలతో ఫేమస్‌ అయింది. వీటితో పాటు కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా చేయగా తాజాగా పుష్ప హిందీ వెర్షన్‌లోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో స్పెషల్ ఇండెంటిఫికేషన్ దక్కించుకున్నారు.