Upasana : సోదరి పెళ్లి వేడుకల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన

తన సోదరి వివాహ వేడుకలకు వచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఫోటోలు షేర్ చేసి.. 'ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది మానవత్వం, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి....

Upasana :  సోదరి పెళ్లి వేడుకల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన

Upasana

మెగా కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగానే కాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. ఒకవైపు అపోలో బాధ్యతలు నిర్వహిస్తూ మరో వైపు తన సొంత బిజినెస్ లు చూసుకుంటూ ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఉపాసన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపైన కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన ట్రాన్స్‌జెండర్స్‌తో ముచ్చటించారు. తన సోదరి వివాహ వేడుకలకు వచ్చిన ట్రాన్స్‌జెండర్స్‌తో ఉపాసన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Samantha : సోషల్ మీడియాలో మరో రికార్డ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన సమంత..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ట్రాన్స్‌జెండర్స్‌ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపింది ఉపాసన. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ట్రాన్స్‌జెండర్స్‌ ఫ్రెండ్స్ ని పరిచయం చేసింది. ఉపాసన సోదరి అనుష్ పాలా పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అనుష్ పాలా పెళ్లి వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్లను ఉపాసన తన ఇంటికి ఆహ్వానించి వారితో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఫోటోలను మెగా కోడలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Bigg Boss 5 : మళ్ళీ హగ్గులంటూ మొదలుపెట్టిన సిరి.. ఇవ్వాలా వద్దా అని షణ్ముఖ్‌

ఆ ఫోటోలు షేర్ చేసి.. ‘ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది మానవత్వం, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి ఒక సరైన అవకాశం. అనుష్ పాల్ వివాహ వేడుకలను ఎంతో ఆప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలానేది మీరు ఎల్లప్పుడూ నాకు నేర్పుతారు. నేను హైదరాబాద్ లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమాజాన్ని గౌరవిస్తాను. ఇది భారతదేశంలోని పురాతనమైన వాటిలో ఒకటి. హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం విశేషంగా భావిస్తున్నాం. జీవితం గురించి చెప్పడానికి వారి వద్ద గొప్ప కథలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని పోస్ట్ చేసింది. మరోసారి ఉపాసన చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.