Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!

ఈ సినిమా ఆ హీరోకైతే అబ్బ.. అదిరిపోతుంది అనుకుంటూ కథలు రెడీ చేసుకుంటారు. కానీ తీరా హీరోల దగ్గర కెళ్లాక.. అబ్బే ఇది నా ఇమేజ్ కి సూట్ కాదు, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అంటూ సినిమా..

Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!

Upcoming Movies

Upcoming Movies: ఈ సినిమా ఆ హీరోకైతే అబ్బ.. అదిరిపోతుంది అనుకుంటూ కథలు రెడీ చేసుకుంటారు. కానీ తీరా హీరోల దగ్గర కెళ్లాక.. అబ్బే ఇది నా ఇమేజ్ కి సూట్ కాదు, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అంటూ సినిమా నుంచి తప్పుకుంటారు. అప్పుడు అదే స్క్రిప్ట్ చేతులు మారి వేరే హీరోల దగ్గరకెళ్తుంది. అలా రీసెంట్ గా చేతులు మారిన సినిమాలేంటో.. మహేష్ , వెంకటేష్, చిరంజీవి మిస్ అయిన సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

Raviteja: టైగర్ నాగేశ్వరరావు ఎంట్రీ ఇస్తున్నాడుగా!

ఇండస్ట్రీలో సెట్స్ మీదకెళ్లే వరకూ సినిమా మీద గ్యారంటీ ఉండదు. ఒక్కోసారి సెట్స్ మీద కూడా హీరో, హీరోయిన్లని మార్చేస్తూ ఉంటారు. రీసెంట్ గా టాలీవుడ్ అలా కొంతమంది స్టార్లను రీప్లేస్ చెయ్యడం వల్ల సినిమాలు మిస్ అయిపోయారు. బ్యాక్ టూ బ్యాక్ నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న రవితేజ.. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమా మొదలుపెట్టారు. స్టూవర్ట్ పురం పోలీసుల్ని దడదడలాడించిన నాగేశ్వరరావు అనే దొంగ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు రవితేజ. నిజానికి ఈ సినిమా చిరంజీవి చెయ్యాల్సి ఉంది.. కానీ తన ఇమేజ్ కి సూట్ కాదని చిరంజీవి రిజక్ట్ చేస్తే..ఇప్పుడు ఆ సినిమాని రవితేజ చేస్తున్నారు.

Jana Gana Mana: విజయ్ జనగణమన.. పవన్-మహేష్ ఎందుకు వద్దనుకున్నారు?

సీనియర్ స్టార్ వెంకటేష్ రిజక్ట్ చేసిన మరో సినిమా కూడా రవితేజ చేస్తున్నారు. తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాలు చేసే నక్కిన త్రినాధ రావు.. ఓ ఇంట్రస్టింగ్ స్టోరీని వెంకటేష్ కి చెప్పారు. కానీ వెంకటేష్ ఆ సినిమా చెయ్యడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఇప్పుడు అదే సినిమాని ధమాకా టైటిల్ తో రవితేజ చేస్తున్నారు. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

వెరీ రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా అనౌన్స్ చేశారు. నిజానికి పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని మహేష్ బాబుతో చెయ్యాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు పూరి. కానీ మహేష్ ఈ స్ట్రిప్ట్ మీద అంతగా ఇంట్రస్ట్ చూపించకపోవడంతో జనగణమన ఇప్పుడు రౌడీ హీరో చేతిలోకొచ్చింది. విజయ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

Dhamaka: మాస్ రాజా ధమాకా.. ప్రణవిగా శ్రీలీల!

పుష్ప సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉన్నదే. సుకుమార్.. మహేష్ బాబుతో సినిమా చెయ్యాలని దాదాపు రెండేళ్లు వెయిట్ చేశారు. కానీ పుష్ప స్టోరీ విన్న తర్వాత అంత మాస్ క్యారెక్టర్ లో మహేష్ పర్ ఫామెన్స్ డైజెస్ట్ చేస్కోవడం కష్టమని, ఆడియన్స్ అంతగా రిసీవ్ చేస్కోరని.. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు మహేష్. అయితే అదే సినిమాని సుకుమార్ బన్నీతో కలిసి భారీగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోంది.

Animal Movie : పక్కా ప్లానింగ్.. రిలీజ్ డేట్ లాక్..

హీరోలే కాదు.. ఈమధ్య హీరోయిన్లు కూడా మారపోతున్నారు. ఈ క్యారెక్టర్ కి ఒక హీరోయిన్ ని అనుకుని.. రకరకాల కారణాలతో ఆ హీరోయిన్ విత్ డ్రా అవ్వడంతో ఈ సినిమాలు చేసే బంపర్ ఆఫర్ దక్కించుకుంటున్నారు మిగతా హీరోయిన్లు. లేటెస్ట్ గా అర్జున్ రెడ్డితో సెన్సేషన్ అయిన డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ చెయ్యబోతున్న సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిణీతి ప్లేస్ లో సౌత్ హీరోయిన్ రష్మిక మందాన చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యానిమల్ టీమ్.

Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాకు సంబంధించి కూడా హీరోయిన్ రీప్లేస్ అయ్యింది. నిజానికి ఈ సినిమాలో నాగార్జునకు జంటగా కాజల్ నటించాల్సి ఉంది. అయితే కాజల్ కి పెళ్లై.. ప్రెగ్నెన్సీ రావడంతో ఘోస్ట్ మూవీ నుంచి తప్పుకుంది కాజల్ .ఇప్పుడు కాజల్ ప్లేస్ లో సోనల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.