క్యారెక్టర్ కోసం కష్టపడుతున్నారు!

  • Edited By: sekhar , November 11, 2020 / 06:20 PM IST
క్యారెక్టర్ కోసం కష్టపడుతున్నారు!

Sports Backdrop Movies: సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవుతూ.. అవసరమైతే ట్రెండ్‌ సెట్ చేసుకుంటూ.. తమను తాము అప్‌డేట్ చేసుకోవాలి. లేకపోతే.. కాంపిటీషన్‌లో సర్వైవ్ అవ్వడం కష్టం. అందుకే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చెయ్యడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్లు.

ఆ కోవలో భాగంగా సినిమా కోసం నానా కష్టాలు పడుతున్నారు మన స్టార్లు. సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నా.. ఆ క్యారెక్టర్‌కి తగినట్టు మౌల్డ్ అయిపోతున్నారు. ప్రస్తుతం నాగశౌర్య ఇలాంటి స్టేజ్ లోనే ఉన్నారు. ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమాలో.. తన క్యారెక్టర్ కోసం శౌర్య చాలా కష్టపడుతున్నాడు. సిక్స్ ప్యాక్ కాదు ఏకంగా 8 ప్యాక్ చేసి ఆక్యారెక్టర్ మీద తనకున్న డెడికేషన్‌ని చూపించుకున్నాడు.


ఈ మధ్య వరుసగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ సినిమాల్లో వరుణ్ తేజ్ ‘బాక్సర్’ (వర్కింగ్ టైటిల్) మూవీ కూడా ఒకటి. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకోసం వరుణ్.. 3 నెలలు వరల్డ్ ఫేమస్ బాక్సర్ నీరజ్ గోయత్ దగ్గర ప్రొఫెషనల్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. అంతేకాదు.. నిద్రలేకుండా అర్థరాత్రి వరకూ షూటింగ్స్ చేస్తూ.. తను చేస్తున్న రోల్ మీద తన కమిట్‌మెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు.


హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా క్యారెక్టర్ కోసం కష్టపడుతున్నారు. ఇటు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న తాప్సీ ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం బాగా చెమటోడుస్తోంది. రన్నర్ క్యారెక్టర్ చేస్తున్న తాప్సీ.. కాళ్లు స్ట్రాంగ్‌గా ఉండడం కోసం టఫ్ ఎక్సర్‌సైజెస్ చేస్తోంది. జిమ్‌లో కష్టపడుతూ తన గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తోంది.https://10tv.in/stars-weight-loss-and-gain-secret/
మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా క్యారెక్టర్ కోసం కష్టపడుతోంది. బేసిక్‌గా నార్త్ హీరోయిన్ అయినా కూడా సౌత్‌లో బిజీగా ఉంటోంది. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తున్న నిధి.. ప్రజెంట్ తను చేస్తున్న సినిమా కోసం ట్యూషన్ పెట్టించుకుని మరీ తమిళ్ నేర్చుకుంది. అంతేకాదు ఇప్పటికి తమిళ్ మాట్లాడగలుగుతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని షేర్ చేసుకుంది నిధి అగర్వాల్. ఇలా స్టార్లు.. క్యారెక్టర్స్ కోసం కష్టపడుతూ సినిమా పట్ల తమకున్న కమిట్‌మెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు.