Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది! | Update On Virata Parvam Release Today

Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది!

యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి...

Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది!

Virata Parvam: యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను అనేకసార్లు వాయిదా వేశారు. ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు సైలెంట్‌గానే ఉంది.

Virata Parvam: ఓటీటీలో విరాటపర్వం.. భారీ డీల్ సెట్?

దీంతో విరాటపర్వం చిత్రం అసలు రిలీజ్ అవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ సినిమా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయిందని, అందుకే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను లైట్ తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ, విరాటపర్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఓ అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Virata Parvam: విరాట పర్వం.. ఇక కష్టమేనా..?

ఈ మేరకు విరాటపర్వం రిలీజ్ అప్‌డేట్‌ను ఇవాళ(మే 6) సాయంత్రం 5 గంటలకు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా 90ల నాటి తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. మరి విరాటపర్వం సినిమా నుండి రాబోతున్న రిలీజ్ అప్‌డేట్ ప్రేక్షకులకు ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ ఇస్తుందో.. సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

×