Kabzaa Movie: ఓటీటీ డేల్ లాక్ చేసుకున్న కబ్జ.. ఎప్పుడంటే..?

కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జ’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

Kabzaa Movie: ఓటీటీ డేల్ లాక్ చేసుకున్న కబ్జ.. ఎప్పుడంటే..?

Upendra Kabzaa Movie Locks OTT Date

Kabzaa Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ కబ్జ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఉపేంద్ర అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాను చంద్రు డైరెక్ట్ చేశాడు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రావడంతో చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి.

Kabzaa : కబ్జ సక్సెస్ మీట్ గ్యాలరీ..

ఇక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన కబ్జ చిత్రానికి కన్నడలో మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మిగతా భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ కాగా, ఈ సినిమాకు ఇక్కడ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. దీంతో ఈ సినిమా తెలుగునాట విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.

Kabzaa : బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపేంద్ర.. కబ్జ మూవీలో మరో స్టార్ హీరో!

కబ్జ చిత్రాన్ని ఏప్రిల్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించగా, స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కేమియో పాత్రలో కనిపించాడు. శ్రియా సరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.