Kabzaa Movie: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న కబ్జ.. ఎప్పుడంటే..?
కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘కబ్జ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. కబ్జ మూవీని ఏప్రిల్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Upendra Kabzaa Ready For OTT Streaming From This Date
Kabzaa Movie: కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘కబ్జ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు చూసి ‘కేజీయఫ్’ను మించి ఈ సినిమా ఉండబోతుందని అభిమానులు అనుకున్నారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై కన్నడనాట అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమాను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Kabzaa : బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపేంద్ర.. కబ్జ మూవీలో మరో స్టార్ హీరో!
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది కబ్జ మూవీ. కానీ, తెలుగులో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. దీంతో ఇక్కడ ఈ సినిమా ఫ్లాప్ మూవీగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ చేశారు మేకర్స్. కబ్జ మూవీని ఏప్రిల్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Kabzaa : కన్నడ రేంజ్ ని పెంచడానికి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా..
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించగా, అందాల భామ శ్రియా సరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చంద్రు డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.