Kabzaa : మార్చిలో థియేటర్ల ‘కబ్జా’కి సిద్దమైన ఉపేంద్ర..

ఉపేంద్ర పాన్ ఇండియా చిత్రం 'కబ్జ' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ నేడు అనౌన్స్ చేశారు మేకర్స్. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది మార్చి..

Kabzaa : మార్చిలో థియేటర్ల ‘కబ్జా’కి సిద్దమైన ఉపేంద్ర..

Kabzaa

Kabzaa : ఈ మధ్య కాలంలో కన్నడ చిత్ర సీమ నుంచి వస్తున్న సినిమాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. తాజాగా మరో సినిమా పాన్ ఇండియా బాక్స్ పై దాడికి సిద్దమవుతుంది. అదే కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన ‘కబ్జ’. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. కేజీఎఫ్ రేంజ్ లో టీజర్ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

Kabzaa : కన్నడ రేంజ్ ని పెంచడానికి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా..

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. కన్నడ, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాది మార్చి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. బ్రిటిషర్లు పాలిస్తున్న 1942 కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుంది. ఈ మూవీలో మరో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరికీ సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ చూసే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు. శ్రియా సరన్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా ఈ సినిమాకి ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో చంద్రు, ఉపేంద్ర కలయికలో వచ్చిన ‘బ్రహ్మ’, ‘ఐ లవ్యూ’ చిత్రాల భారీ విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కేజీఎఫ్ చిత్రాలకు పని చేసిన రవి బస్రూర్ పని చేస్తున్నాడు. శ్రీధర్ లగడపాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా దర్శకుడు చంద్రు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.