థియేటర్లు రీఓపెన్ తర్వాత షో పడే రెండు సినిమాలు ఇవే!

  • Published By: sekhar ,Published On : October 21, 2020 / 06:35 PM IST
థియేటర్లు రీఓపెన్ తర్వాత షో పడే రెండు సినిమాలు ఇవే!

Uppena – Love Story: కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ 5.0లో భాగంగా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి కొన్ని చోట్ల హాళ్లు తెరుచుకున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల థియేటర్ల యజమానులు ధైర్యం చేయలేదు. కాస్త ఆలస్యంగానైనా థియేటర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ సినిమాల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటినుంచే థియేటర్లు బ్లాక్ చేస్తున్నారు.


మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయవుతున్న ‘ఉప్పెన’ సినిమాను డిసెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. ‘నీకన్నునీలి సముద్రం’ పాటకు భారీ స్పందన లభించింది.


యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పది రోజుల గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Image

Image