Urvashi Rautela : వామ్మో.. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇంటి ధర.. ఏకంగా అన్ని కోట్లా?
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించినా ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ లోనే కాక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి.

Urvashi Rautela Living in high cost house at Mumbai worth in Crores
Urvashi Rautela House : బాలీవుడ్(Bollywood) లో 2013లో ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా. పలు హిందీ సినిమాల్లో నటించిన ఊర్వశి ఆ తర్వాత ఐటెం సాంగ్స్(Item Songs) కి స్పెషల్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించినా ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది. బాలీవుడ్ లోనే కాక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి. ఈ పాట క్లిక్ అవడంతో టాలీవుడ్ లో కూడా వరుసగా ఐటెం సాంగ్స్ ఆఫర్లు దక్కించుకుంటుంది ఊర్వశి.
అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి. త్వరలో రామ్ – బోయపాటి సినిమాలో కూడా ఓ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. తాజాగా ఈ భామ కాన్స్ లో కూడా అలరించింది. అయితే ఊర్వశి రౌతేలా గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఊర్వశి తన కొత్త ఇంట్లోకి మారింది.
ముంబైలో దివంగత అగ్ర నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే ఉన్న ఖరీదైన ఇంట్లోకి ఊర్వశి తాజాగా షిఫ్ట్ అయిందని బాలీవుడ్ సమాచారం. నాలుగంతస్థుల బంగ్లా, పెద్ద తోట, స్విమ్మింగ్ ఫూల్, సొంత వ్యాయామశాల.. ఇలా అనేక లగ్జరీ సౌకర్యాలతో, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఆ ఇల్లు ఉందట. అయితే ఈ ఇంటి ఖరీదు ఏకంగా 190 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఊర్వశి రౌతేలా అంత ఖరీదు పెట్టి ఇల్లు కొందా లేక ఆ ఇంటిలో అద్దెకు ఉంటుందా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఊర్వశి స్పందిస్తుందేమో చూడాలి.