Urvasivo Rakshasivo: డిసెంబర్ 9న అల్లు శిరీష్ మూవీ.. ఎక్కడో తెలుసా?

మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. ఈ సినిమాను చాలా రోజుల క్రితమే రిలీజ్ చేయాలని చూసినా, పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో శిరీష్-అనుల కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు కితాబిచ్చారు.

Urvasivo Rakshasivo: డిసెంబర్ 9న అల్లు శిరీష్ మూవీ.. ఎక్కడో తెలుసా?

Urvasivo Rakshasivo Movie OTT Release Date Locked

Urvasivo Rakshasivo: మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. ఈ సినిమాను చాలా రోజుల క్రితమే రిలీజ్ చేయాలని చూసినా, పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో శిరీష్-అనుల కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు కితాబిచ్చారు.

Urvasivo Rakshasivo: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఒకటి కాదు రెండు!

బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను డిసెంబర్ 9న ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఓటీటీ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Urvasivo Rakshasivo: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ!

రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.