Urvasivo Rakshasivo: మెగా హీరో సినిమాను మరో ఓటీటీలో కూడా చూడొచ్చు!

మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుగా చిత్ర యూనిట్ మలిచిన తీరు బాగున్నా, ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా తడబడింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Urvasivo Rakshasivo: మెగా హీరో సినిమాను మరో ఓటీటీలో కూడా చూడొచ్చు!

Urvasivo Rakshasivo Movie To Stream In One More OTT

Urvasivo Rakshasivo: మెగా హీరో అల్లు శిరీష్ నటించిన రీసెంట్ మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుగా చిత్ర యూనిట్ మలిచిన తీరు బాగున్నా, ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా తడబడింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Urvasivo Rakshasivo: డిసెంబర్ 9న అల్లు శిరీష్ మూవీ.. ఎక్కడో తెలుసా?

ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను థియేటర్స్‌లో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ సినిమాను డిసెంబర్ 9న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Urvasivo Rakshasivo: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటీటీ పార్ట్‌నర్ లాక్.. ఒకటి కాదు రెండు!

ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాను యూత్ ఆదరిస్తారని తాము భావిస్తున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అల్లు శిరీష్ సరసన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ఆమని తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అచ్చు రాజమని, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.