NTR : హోమ్ అఫ్ హాలీవుడ్‌కి స్వాగతం.. ఎన్టీఆర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికిన అభిమానులు..
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో నటించి సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా RRR మూవీని లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీన్ చేస్తున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేస్ లో కూడా నిలవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హోమ్ అఫ్ హాలీవుడ్ కి చేరుకున్నారు. దీంతో అక్కడ ఎన్టీఆర్ అభిమానులు..

NTR : టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో నటించి సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకోవడమే కాదు గ్లోబల్ స్థాయిలో కూడా గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా RRR మూవీని లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీన్ చేస్తున్నారు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేస్ లో కూడా నిలవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హోమ్ అఫ్ హాలీవుడ్ కి చేరుకున్నారు.
NTR30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్.. కొరటాల ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?
దీంతో అక్కడ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు. భారీ హోర్డింగ్స్ పై
‘వెల్‌కమ్ టు హోమ్ అఫ్ హాలీవుడ్ ఎన్టీఆర్’ అంటూ ఏర్పాటు చేయడమే కాకుండా.. LED మూవింగ్ ట్రక్స్ తో కూడా ఎన్టీఆర్ కి వెల్‌కమ్ హాలీవుడ్ అంటూ నగర్ విధుల్లో ఆ ట్రక్స్ ని నడుపుతున్నారు. హాలీవుడ్ టౌన్ లో ఒక ఇండియన్ హీరోకి ఈ రేంజ్ లో స్వాగతం ఎదురవ్వడం అందర్నీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఇటీవల RRR స్క్రీనింగ్ లో ఓటర్స్ తో చిట్ చాట్ నిర్వహించారు రాజమౌళి, ఎన్టీఆర్. ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో నేన్ను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన బెస్ట్ సీన్ కొమరం భీముడొ సాంగ్. అంతా బాగా నటించాడు ఎన్టీఆర్. మీరు కేవలం అతని కనురెప్పకి కెమెరా పెట్టినా, దానితో కూడా యాక్టింగ్ చేస్తాడు’ అంటూ ప్రశంసించాడు. ఇక ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ‘వెరైటీ’.. ఆస్కార్ ప్రెడిక్షన్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరుని ప్రకటించింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లిస్ట్ లో ఆస్కార్ రేస్ లో నిలిచింది. బెస్ట్ మూవీ క్యాటగిరీలో కూడా ఈ సినిమా చోటు సాధించే అవకాశం ఉంది అంటున్నారు హాలీవుడ్ ప్రతినిధులు.
USA Ntr Fans ( @NTRFans_USA ) put up grand hoardings and LED moving trucks to welcome Man of Masses NTR to Beverly Hills. NTR is in LA to attend TCL Chinese IMAX screening of RRR and Golden Globes awards ceremony. #NTRGoesGlobal pic.twitter.com/Bv7egelVCB
— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2023