Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమాలో 10 శాతం షూట్ కూడా కాలేదు.. అప్పుడే ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎందుకు?
గ్లింప్స్ రిలీజ్ అయ్యిందని ఫ్యాన్స్ ఆనందపడుతుంటే, అసలు అప్పుడే ఈ సినిమాకి ఈ రేంజ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారా అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Ustaad Bhagat Singh Movie unit doing promotions even not completing shoot
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్. మూడేళ్ల క్రితం అనౌన్స్ అయిన ఈ మూవీ లాస్ట్ మంత్ లోనే సెట్స్ మీదకెళ్లింది. ఎక్కువ రోజులు షూట్ కూడా జరగలేదు ఈ సినిమాకి. కేవలం రెండు షెడ్యూల్స్ షూట్ జరిగింది. మహా అయితే ఓ పది శాతం షూటింగ్ అయి ఉంటుంది. అయినా సరే సినిమాకి సంబందించి ప్రతి చిన్న అప్డేట్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది టీమ్. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. గ్లింప్స్ రిలీజ్ అయ్యిందని ఫ్యాన్స్ ఆనందపడుతుంటే, అసలు అప్పుడే ఈ సినిమాకి ఈ రేంజ్ ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారా అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ రచ్చ మామూలుగా లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్, అందులోనూ పవన్ కళ్యాణ్ పోలీస్ రోల్ దీనికి మించి పవన్ ఫ్యాన్స్ కి ఏం కావాలి…? ఈ క్రేజ్ తోనే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో సునామి క్రియేట్ చేస్తోంది. పాత రికార్డుల పాతర కొత్త రికార్డుల జాతర అంటూ మేకర్స్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మీద హైప్స్ పెంచేస్తున్నారు. ఈ సారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ సినిమా మీద అంచనాలు ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. అయితే అసలు సినిమా ఇంకా ఫుల్ స్వింగ్ లో షూటే జరగలేదు, అప్పుడే ఇంత హంగామా ఎందుకు చేస్తున్నట్టో అనుకుంటున్నారు కొంతమంది.
ఓ వైపు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ అవుతూనే ఉంది. మరో వైపు ఈ సినిమా తర్వాతే స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అప్పుడే ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశామంటూ ఫోటోలు రిలీజ్ చేసింది టీమ్. మైత్రి మూవీస్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్, పూజాహెగ్డే, శ్రీలీల లీడ్ రోల్స్ లో హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పవన్ లేకపోయినా సినిమాకి సంబందించి వర్క్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. త్వరలోనే యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతోందని అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇలా అన్నిటికన్నా వెనక స్టార్ట్ అయ్యింది కాబట్టి అందరి కన్నా వెనకే ఉంటామేమో అన్న భయంతో ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రమోట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
Ustaad Bhagat Singh : ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వచ్చేసింది..
అలాగే పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ మీదున్న క్రేజ్ ని వదలుకొని సినిమాపై మరిన్ని అంచనాలు పెంచి క్యాష్ చేసుకోవాలని కూడా చిత్రయూనిట్ చూస్తోందని సమాచారం. ఇంకా ఈ సినిమాకు చాలా షూటింగ్ మిగిలే ఉంది. ప్రస్తుతం పవన్ చిన్న పొలిటికల్ బ్రేక్ తీసుకున్నారు. అది అయ్యాక పవన్ డేట్స్ మళ్ళీ ఎప్పుడిస్తే అప్పుడే ఈ సినిమా షూట్ జరగనుంది. మొత్తానికి సినిమా షూట్ అసలు సగం కూడా అవ్వకుండానే ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారంటే, ఇక సినిమా మొత్తం అయిపోతే ఇంకే రేంజ్ లో హంగామా చేస్తారో చూడాలి.