Jr NTR-Allu Arjun: వెకేషన్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్లు!

సెకండ్ వేవ్ స్లో డౌన్ అయ్యాక.. అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తున్న స్టార్ హీరోలు.. ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ తో బిజీగా సెట్లోనే ఉండే హీరోలు..

Jr NTR-Allu Arjun: వెకేషన్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్లు!

Jr Ntr Allu Arjun

Jr NTR-Allu Arjun: సెకండ్ వేవ్ స్లో డౌన్ అయ్యాక.. అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తున్న స్టార్ హీరోలు.. ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ తో బిజీగా సెట్లోనే ఉండే హీరోలు.. ఫారెన్ చెక్కేసి ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉండే స్టార్ హీరోలు.. ఈ సారి చిన్న బ్రేక్ తీసుకున్నారు. జనరల్ గా సినిమా మధ్యలోనే షూట్ బ్రేక్స్ తీసుకునే హీరోలు.. ఇప్పటికే షూటింగ్స్ లేట్ అవ్వడంతో లాంగ్ షెడ్యూల్స్ చేసి మరీ షూటింగ్ కంప్లీట్ చేశారు.

Chiranjeevi: ఒకేసారి 5 సినిమాలు.. ఎప్పుడూ లేనంత బిజీగా మెగాస్టార్!

అంతేకాదు.. ఒకవైపు రిలీజ్ హడావిడి, ప్రమోషన్లతో ఫుల్ బిజీగాఉన్న స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ.. చిన్న బ్రేక్ తీసుకుని వెకేషన్ కి వెళ్లారు. సోషల్ మీడియాకి పెద్దగా అటాచ్ కాని ఎన్టీఆర్.. ఈ సారి తన ఫారెన్ ట్రిప్ విశేషాల్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక వైపు ట్రిపుల్ఆర్, మరోవైపు మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్స్ తో బాగా హెక్టిక్ వర్క్ చేసిన ఎన్టీఆర్ చిన్న బ్రేక్ తీసుకుని ఫారెన్ వెళ్లారు. ఫ్యామిలీతో సహా ప్యారిస్ వెళ్లి.. అక్కడ ఫుల్ చిల్ అవుతున్నారు. పెద్ద కొడుకు అభయ్ రామ్ తో ఐఫిల్ టవర్ పిక్ పోస్ట్ చేశారు ఎన్టీఆర్.

RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

గ్యాప్ దొరికితే చాలు.. ఎప్పుడూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే బన్నీ.. ఈసారి దుబాయ్ చెక్కేశారు. మొన్నీమధ్యనే మాల్దీవ్స్ వెళ్లొచ్చిన బన్నీ ఫ్యామిలీ.. ఈసారి అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేట్ చెయ్యడానికి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వెళ్లారు. అక్కడ అర్హ బర్త్ డే సెలబ్రేట్ చేసి తన ఫ్యామిలీ తో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.