Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్‌తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోటే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి...............

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

Trivikram

Trivikram :  మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్‌తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోటే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటి సినిమా భారీ హిట్ అవ్వడంతో తర్వాత సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. అయితే వైష్ణవ తేజ్ హీరోగా, రకుల్ హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమా ఫ్లాప్ గా మిగిలి కనీసం రూ.10 కోట్ల కలెక్ష‌న్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

దీంతో రెండవ సినిమా వైష్ణవ్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘రంగ రంగ వైభ‌వంగా’ రానుంది. గిరీశ‌య్య అనే కొత్త దర్శకుడితో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా వైష్ణవ్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో కాదు, నిర్మాణంలో.

Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..

ఇటీవల త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైష్ణవ్ హీరోగా శ్రీకాంత్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ సినిమాని త్రివిక్రమ్ ఓకే చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది ఈ సినిమా. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ తన సొంత బ్యాన‌ర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో పాటు సితార ఎంట‌ర్టైన‌మెంట్స్‌తో క‌లిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇందులో ‘పెళ్ళి సంద‌D’ ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన చేయనున్నారు.