Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..

తాజాగా రంగరంగ వైభవంగా సినిమా నుంచి టీజర్‌ రిలీజైంది. నన్నే చూస్తావ్‌, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.................

Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..

Rangaranga Vaibhavamga

RangaRanga Vaibhavamgaa :  ఉప్పెన సినిమాతో డెబ్యూ ఇచ్చి మొదటి సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేసి అందరితో వాహ్వా అనిపించుకున్నాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్. రెండో సినిమా కొండపొలం ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో ‘రంగరంగ వైభవంగా’ అంటూ మూడో సినిమాని తీసుకొస్తున్నాడు వైష్ణవ్. ఇందులో రొమాంటిక్ సినిమాతో కుర్రాళ్లకు మత్తెక్కించిన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు గిరీశయ్య దీనిని తెరకెక్కిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా రంగరంగ వైభవంగా సినిమా నుంచి టీజర్‌ రిలీజైంది. నన్నే చూస్తావ్‌, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అంటూ హీరోయిన్‌ వాయిస్‌తో టీజర్‌ మొదలైంది. హీరోహీరోయిన్లు టామ్‌ అండ్‌ జెర్రీలా మాటిమాటికి గొడవ పడుతున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ తో మాట్లాడకపోయినా ప్రాబ్లమ్ వస్తే వచ్చి ఫైట్ కూడా చేస్తాడు అన్నట్టు మాస్ యాక్షన్ ని కూడా చూపించారు. లాస్ట్ లో చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు అంటూ హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు చూపించారు.

Ananya Nagalla : తెల్ల తెల్లని చీర.. జారుతున్నాది సందె వేళ..

మొత్తానికి టీజర్‌ కొత్తగా ఇంట్రస్టింగ్‌ ఉంది. యూత్ కచ్చితంగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.