Vaishnav Tej: మెగా హీరో డేరింగ్ స్టెప్.. అంచనాలు పెంచేస్తున్నాడుగా!

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, తొలిసినిమా ఉప్పెనతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల....

Vaishnav Tej: మెగా హీరో డేరింగ్ స్టెప్.. అంచనాలు పెంచేస్తున్నాడుగా!

Vaishnav Tej Signs Movie With A Lady Director

Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, తొలిసినిమా ఉప్పెనతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన మూడో సినిమాను కూడా రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ‘రంగరంగ వైభవంగా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Viashnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..

ఇక ఇప్పుడు ఈ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది. వైష్ణవ్ తేజ్ తన నెక్ట్స్ మూవీని ఓ లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నాగశౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను తెరకెక్కించిన సాయి సౌజన్య అనే లేడీ డైరెక్టర్ చెప్పిన కథకు వైష్ణవ్ తేజ్ ఇంప్రెస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Vaishnav Tej: ‘ఖుషి’ని చూపిస్తున్న వైష్ణవ్ తేజ్..?

ఆమె కథ చెప్పిన విధానం బాగుండటంతో, వైష్ణవ్ తేజ్ ఆమెతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. డిఫరెంట్ జోనర్లతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వైష్ణవ్ తేజ్ ఈసారి ఎలాంటి కథతో మనముందుకు వస్తాడా అనేది చూడాలి. ఇక ఈ లేడీ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ చేయబోయే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.