Vakeel Saab : డబ్బింగ్ పూర్తి చేసిన ‘వకీల్ సాబ్’

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.

Vakeel Saab : డబ్బింగ్ పూర్తి చేసిన ‘వకీల్ సాబ్’

Vakeel Saab Dubing

Vakeel Saab Dubbing : దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి.

Vakeel Saab

ఇటీవల ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కంప్లీట్ చేశారు. దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాస‌న్‌ కథానాయిక కాగా, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు.

Vakeel Saab

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
డైలాగ్స్‌: తిరు
యాక్ష‌న్: ర‌వివ‌ర్మ‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌
కో- ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు – శిరీష్
మాటలు-మార్పులు-ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

వకీల్ సాబ్ – ‘గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు’..