Pawan Kalyan : వకీల్ సాబ్ వచ్చేశాడు..అభిమానులు ఫుల్ ఖుష్

పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్‌` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Pawan Kalyan : వకీల్ సాబ్ వచ్చేశాడు..అభిమానులు ఫుల్ ఖుష్

Vakeelsaab

Vakeel Saab : పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్‌సాబ్‌` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 2500 స్ర్కీన్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. హిందీ `పింక్‌` రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా యూఎస్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోస్‌ పడ్డాయి.

మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ ఈ రోజు మార్నింగ్‌ నాలుగు గంటల నుంచే బెనిఫిట్‌ షోస్‌ పడ్డాయి. థియేటర్లలో సందడి ఎర్లీ మార్నింగ్‌ నుంచే ప్రారంభమైంది. యూఎస్‌, ఇతర కంట్రీస్‌లో సినిమా 250కిపైగా స్క్రీన్ల్‌లో ప్రదర్శితమౌతోంది. అక్కడ భారీ ఓపెనింగ్‌ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరికొత్త రికార్డ్ లు తిరగరాయబోతుందట. ఇంటర్వెల్‌కి ముందు ఓ ఫైట్‌ వస్తుందని, ఆ ఫైట్‌ గూస్‌బంప్స్ తీసుకొస్తుందని అంటున్నారు. ఇక పవన్‌ కోర్ట్ కి వెళ్లడం సెకండాఫ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు వెల్లడిస్తున్నారు. కోర్ట్ లో ప్రకాష్‌ రాజ్‌ నందాగా కనిపిస్తారని, ప్రకాష్‌రాజ్‌ నిందితుల తరఫున వాధించే లాయర్‌గా కనిపిస్తాడు. కోర్ట్ సీన్లు హైలైట్‌గా ఉంటాయని, ప్రధానంగా చాలా ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతాయని అంటున్నారు.

పవన్‌, ప్రకాష్‌ రాజ్‌ మధ్య వాదోపవాదాలు పీక్‌లో ఉంటాయని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ ని తాగుబోతుగా చూపించడం, ఆయన ఒంటరిగా ఉండటం సన్నివేశాలు ఆలోచింప చేస్తాయని, సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తాయని తెలుస్తోంది. మొదట సినిమా `మగువా.. మగువా.. `అనే సాంగ్‌తో ప్రారంభమవుతుంది. మహిళల గొప్పతనం తెలిపేలా ఈ పాట సాగుతుందని అంటున్నారు. మొదటి భాగం మొత్తం అమ్మాయిలు వేధింపులు ఎదుర్కొనడం, తమ కేసుని వాధించేందుకు పవన్‌ని ఒప్పించే ప్రయత్నం చేయడం మీద సాగుతుందని తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ ఆయనకు జోడిగా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. `ఎంసీఏ` ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
వకీల్ సాబ్ కోసం తెల్లవారు జాము నుండి సినిమా ధియేటర్స్ వద్ద పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు.

Read More : Ganapati Idol : రెండో శతాబ్దం నాటి గణపతి విగ్రహం..