Updated On - 3:57 pm, Thu, 8 April 21
వకీల్ సాబ్ సినిమాతో మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా.. రికార్డు స్థాయిలో టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదికి పైగా థియేటర్లు ముసుకోగా.. ఓపెన్ అయ్యాక కూడా అంతంత మాత్రంగానే వస్తున్నారు ప్రేక్షకులు.. ఎట్టకేలకు థియేటర్లో బుకింగ్‌లు అదిరిపోగా.. థియేటర్లలో సందడి వాతావరణం కనిపించబోతుంది.
ఈ క్రమంలోనే గత రికార్డులను బ్లాస్ట్ చేస్తూ.. తెలుగు సినిమాకి ఎప్పుడూ లేని విధంగా అమెరికాలో 700 స్క్రీన్స్‌లో ‘వకీల్ సాబ్’ను ప్రదర్శిస్తున్నారు. ఇది ఓవర్సీస్ రికార్డ్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ లేనంతగా.. దేశవ్యాప్తంగా షోలు వేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్.. ఏఎంబీలో కూడా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తుంది.
ఏఎంబీలో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా.. ఏడు స్క్రీన్స్ కలిపి ‘వకీల్ సాబ్’ మొదటిరోజు 27 షోలు వెయ్యబోతున్నారు. ‘వకీల్ సాబ్’ విడుదలకు నాలుగు రోజుల ముందే ఏఎంబీలో మొత్తం 27 షోలకు టికెట్లు బుక్ అవగా.. ఇది ఇప్పటివరకు మహేష్ బాబు థియేటర్లో ఒక సినిమాకు సంబంధించిన ఆల్‌టైమ్ రికార్డ్.
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..
Vakeel Saab: మరో నెల రోజులు థియేటర్లో ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్!
Odisha Vakeel saab : వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఒడిషాలో రెండు థియేటర్లు సీజ్
నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్
Vakeel Saab: దర్శక, నిర్మాతలకు మెగాస్టార్ చిరు సత్కారం!
Pawan Kalyan : హోం క్వారంటైన్లో పవన్ కళ్యాణ్