వకీల్ సాబ్ టీజర్ వచ్చింది.. జూ ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి?

వకీల్ సాబ్ టీజర్ వచ్చింది.. జూ ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి?

VakeelSaabTeaser komaramBheemNTR| సినిమాల్లో రికార్డులు చెప్పుకోవాలంటే.. వంద రోజులు ఇన్ని సెంటర్లు, యాబై రోజులకు ఎన్ని సెంటర్లు అని చెప్పుకునే వాళ్లం. ట్రెండ్ మారింది. అంతా డిజిటల్ మయం అయిపోయాక రికార్డులు కూడా అలాగే చెప్పుకుంటున్నాం. కొత్త సినిమా వస్తుందనే అప్ డేట్ వస్తే చాలు టీజర్, ట్రైలర్ గంటకు ఎంతమంది చూశారు.. 24గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అని రికార్డులు లెక్కపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు.

ఇదంతా యూట్యూబ్ లెక్కలే.. తమ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఇక దాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చేపనిలో పడతారు డిజిటల్ వారియర్స్. అలా ప్రతి సినిమా గురించి వచ్చిన అప్ డేట్ ఓ రెండు మూడు రోజుల వరకూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. కానీ, ఇక్కడ వకీల్ సాబ్ వస్తే.. జూ ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

జక్కన్న రాజమౌళి తీర్చి దిద్దుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కొమరం భీం తో #KomaramBheemNTR హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. #VakeelSaabTEASERతో పాటు సమానంగా ట్రెండ్ చేస్తున్నారు ఇద్దరి అభిమానులు.

మూడేళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయిన పవర్ స్టార్ కోసం అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ వాళ్లను సంతృప్తిపరుస్తుందనుకుంటే ఇక్కడ డిజిటల్ వార్ మొదలైనట్లుగా కనిపిస్తుంది. అయితే వీళ్లు వకీల్ సాబ్ ను టార్గెట్ చేసి ట్రెండ్ చేయడం లేదు. ఇక్కడ జూ.ఎన్టీఆర్ క్రెడిట్ చూపించాలని చేస్తున్నారు.

రాజమౌళ్లి ఎన్టీఆర్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ కొమరం భీమ్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ టీజర్‌కు 3 నిమిషాల్లో 50 వేల లైకులు, 6 నిమిషాల్లో లక్ష లైకులు, 18 నిమిషాల్లో రెండు లక్షల లైకులు వచ్చాయట. ఆ విషయాన్ని చెప్పుకుంటూ ‘వకీల్ సాబ్’ టీజర్‌ను పోలుస్తున్నారు. అదండీ అసలు కథ.