పవర్ స్టార్ పాటొస్తోంది.. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ సాంగ్ లోడింగ్..

  • Published By: sekhar ,Published On : March 6, 2020 / 12:52 PM IST
పవర్ స్టార్ పాటొస్తోంది.. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ సాంగ్ లోడింగ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ (పింక్) రీమేక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘వకీల్ సాబ్’ కి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజిషన్‌లో లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన ‘మగువా మగువా’ అనే ఫస్ట్ సాంగ్‌ను వుమెన్స్ డే స్పెషల్‌గా మార్చి 8వ తేది ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’.. మగువా మగువా.. నీ సరిహద్దులు కలవా’.. అంటూ సాగే ఈ పాట మహిళల గొప్పదనం తెలుపుతూ సాగనుందని తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ చిత్రాన్ని వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.