Vamshi Paidipally : ఈ క్షణం నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.. వంశీ పైడిపల్లి!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా 'వారసుడు'గా విడుదలైంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎమోషనల్ అయ్యి వంశీని గట్టిగా కౌగిలించుకుని అభినందించారు.

Vamshi Paidipally : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’గా విడుదలైంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర పతాకంపై ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ చిత్రంతో దిల్ రాజు తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తెలుగులో ఈ మూవీ విడుదల పై పెద్ద రచ్చే జరిగింది. సంక్రాంతి పండక్కే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉండడం. వీరిద్దరి సినిమాలు కంటే వారసుడు మూవీకి ఎక్కువ థియేటర్లు ఆక్రమిస్తున్నాడు అని దిల్ రాజు తీవ్ర వ్యతిరేకతని ఎదురుకున్నాడు.
Varisu: వారిసు సినిమాలో ఆ హీరోయిన్‌ను లేపేశారా..?
దీంతో దిల్ రాజు వివాదాన్ని ముగించేందుకు తెలుగు వారసుడు రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నాడు. జనవరి12న తమిళంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, 14న తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫాదర్ సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఏడిపిస్తుంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎమోషనల్ అయ్యి వంశీని గట్టిగా కౌగిలించుకుని అభినందించారు.
అందుకు సంబంధించిన వీడియోని వంశీ షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘ఈ రోజు మా నాన్నతో కలిసి వారసుడు సినిమా చూశాను. మూవీ చూసాకా.. మా నాన్న ఇచ్చిన ప్రేమ జీవితంలోనే నేను గెలుచుకున్న గొప్ప బహుమతి. ఈ క్షణం నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. నువ్వు నా హీరో నాన్న. లవ్ యూ’ అంటూ వెల్లడించాడు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్, సంగీత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.
My Biggest achievement was today when My ” Naanna / Appaa ” was overwhelmed watching #Vaarasudu ( #Varisu )… This is the moment I will cherish for lifetime.. ” You are my HERO Naannaa “…..Love You to Eternity… ❤️ pic.twitter.com/E5SokU8x8g
— Vamshi Paidipally (@directorvamshi) January 14, 2023