Vamshi Paidipally : ‘వారసుడు’ సినిమాపై వస్తున్న ట్రోల్స్‌కి సీరియస్ అయిన వంశీ పైడిపల్లి..

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఒక తమిళ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ పైడిపల్లితో విలేకరి ఈ మాట అనగా..

Vamshi Paidipally : ‘వారసుడు’ సినిమాపై వస్తున్న ట్రోల్స్‌కి సీరియస్ అయిన వంశీ పైడిపల్లి..

Vamshi Paidipally

Vamshi Paidipally : తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంలో జనవరి 12న విడుదల కాగా, తెలుగులో జనవరి 14న రిలీజ్ అయ్యింది. కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాలోని ఫాదర్ సెంటిమెంట్ అందర్నీ ఏడిపిస్తుంది.

Varisu: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న వారిసు

కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఒక తమిళ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ పైడిపల్లితో విలేకరి ఈ మాట అనగా.. దర్శకుడు సీరియస్ అయ్యాడు. ఆ కామెంట్ లకు కౌంటర్ ఇస్తూ గట్టిగా సమాధానం ఇచ్చాడు. ‘ఈరోజుల్లో ఒక సినిమా తియ్యడం ఎంత కష్టమో తెలుసా మీకు? మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసం ఎంతమంది కష్టపడతారో తెలుసా మీకు? ఎంతోమంది ఎన్నో వదులుకొని సినిమా మీద పిచ్చితో పని చేస్తున్నారు. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఈరోజు నేనేంటో నాకు తెలుసు.

మనదేశంలో ఉన్న గొప్ప నటుల్లో విజయ్ గారు ఒకరు. అయినా ఇప్పటికి ఆయన డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కష్ట పడుతున్నారు. అది జోక్ కాదు బ్రదర్. అయినా సీరియల్స్ ని ఎందుకు డే గ్రేడ్ చేస్తున్నారు మీరు. అది కూడా ఒక క్రియేటివ్ ఫీల్డే. ఈరోజు ఆ సీరియల్స్ ని ఆదరిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేనిని తక్కువ చేసి మాట్లాడకండి. మనం ఏమి చేయగలం అనేదే మన చేతిలో ఉంటుంది, ఫలితం కాదు. నేను గొప్ప దర్శకుడిని అని చెప్పడం లేదు. నేను ఒక కమర్షియల్ డైరెక్టర్ ని. అలాగే వరిసు చేశా, ఎంటర్‌టైన్ చేశా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.