Vani Jairam : అభిమానించిన వ్యక్తితోనే వాణి జయరాం వైరం..

లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించారు అనే వార్తని జీర్ణించుకోక ముందే ఇండస్ట్రీలో మరో వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రముఖ సింగర్ వాణి జయరాం నిన్న (ఫిబ్రవరి 4) చెన్నై లోని ఆమె ఇంటిలో మరణించారు. కాగా వాణి రోల్ మోడల్ గా తీసుకున్న వ్యక్తితోనే..

Vani Jairam : అభిమానించిన వ్యక్తితోనే వాణి జయరాం వైరం..

Vani Jairam issues with her favourite singer lata mangeshkar

Vani Jairam : లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించారు అనే వార్తని జీర్ణించుకోక ముందే ఇండస్ట్రీలో మరో వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రముఖ సింగర్ వాణి జయరాం నిన్న (ఫిబ్రవరి 4) చెన్నై లోని ఆమె ఇంటిలో మరణించారు. వాణి మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవలే ఈమెకు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇక సింగర్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. వాణి జయరాం సౌత్ కి చెందిన వారు అయినా కెరీర్ మాత్రం నార్త్ సినిమాలతో మొదలయింది.

Vani Jairam : వాణీ జయరాం మరణంపై అనుమానాలు.. పోస్టుమార్టంలో గాయాలు గుర్తింపు!

1971లో రిలీజ్ అయిన జయా బచ్చన్ గుడ్డి సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆ చిత్రంలో వాణి పాడిన మూడు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే ఆమెకు హిందీ పాటలు అంటే కొంచెం మమకారం ఎక్కువ ఉండేది. ఇక వాణి సింగర్ గా ఎదుగుతున్న సమయంలో హిందీలో లతా మంగేష్కర్ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. వాణి కూడా ఆమెకు అభిమాని. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో వాణి, లతా ఆశీర్వాదాలు తీసుకోడానికి ఆమె ఇంటికి వెళ్లిందట. కానీ లతా, ఆమెను కలవడానికి నిరాకరించింది అంటూ వాణి చాలా సార్లు చెప్పుకొచ్చారు.

వాణి పాటలకు ఆదరణ లభిస్తుండడంతో లతా మంగేష్కర్ అసూయకు లోనయ్యేవారట. ఈ క్రమంలో ఒక సంఘటన వీరిద్దరి మధ్య వైరానికి దారి తీసింది. 1979లో వచ్చిన ‘మీరా’ సినిమాకి లతా సోదరుడిని బదులు రవిశంకర్ ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్. అది లతా మంగేష్కర్ కి నచ్చలేదు. ఆ కోపంతో సినిమాలో పాటలు పాడాను అని చెప్పేశారు. దీంతో ఆ చిత్రంలో వాణితో పాటలు పాడించాడు గుల్జార్. ఇక ఆ సినిమాతో లతా, వాణి మధ్య వైరం మరింత పెరిగింది.

ఒక సమయంలో లతా మంగేష్కర్ ఇంటిలో ప్లే బ్యాక్ సింగర్స్ అంతా సమావేశం అయ్యారని, ఆ తరువాత నుంచి వాణికి అవకాశాలు తగ్గాయి అని కూడా వాణి చెప్పుకొచ్చేవారు. ఇక బాలీవుడ్ లో జరుగుతున్న రాజకీయాలు చూడలేక ఆమె చెన్నైకి తిరిగి వచ్చేశారు. అప్పటి నుంచి సౌత్ లోని పాటలు పడుతూ అలరిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు దాదాపు 18 భాషల్లో పాటలను పాడారు వాణి. సుమారు వేయి సినిమాల్లో 10 వేల పాటలను ఆలపించారు.