Vanniyar Sangam : నటుడు సూర్యకు వన్నియార్ సంఘం నోటీసులు..రూ. 5 కోట్లు చెల్లించాలి

నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నా..పోలీసు పాత్రను వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని లీగల్ నోటీసుల్లో తెలిపారు.

Vanniyar Sangam : నటుడు సూర్యకు వన్నియార్ సంఘం నోటీసులు..రూ. 5 కోట్లు చెల్లించాలి

Jai Bheem

Notice To Suriya : ప్రముఖ నటుడు సూర్య నటించిన జై భీమ్ విమర్శకుల ప్రశంసలు అందుకొంటోంది. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే..ఈ ఫిల్మ్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమవర్గాన్ని కించపరిచారంటూ..ఏకంగా..రూ. 5 కోట్ల నష్టరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం..నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు వ్యతిరేకంగా తప్పుడు, హానీకరమైన..పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం..లేదా ప్రచురించడం వెంటనే మానేయాలని సూచించారు. చిత్ర నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కలిగించేలా సినిమాలో ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 2021, నవంబర్ 15వ తేదీ నటుడు సూర్య, జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ కు వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల వ్యవధిలో రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

Read More : Siddipet : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా…టీఆర్ఎస్‌‌లో చేరుతున్నా

నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నా..పోలీసు పాత్రను వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని లీగల్ నోటీసుల్లో తెలిపారు. ఉద్ధేశ్యపూర్వకంగా సబ్ ఇన్స్ పెక్టర్ పేరును మార్చారని, అసలు కథలో..అండర్ ట్రయల్ కస్టడీ మరణంలో పాల్గొన్న సబ్ ఇన్స్ పెక్టర్ ని అంథోని సామి అని పిలుస్తారని అతను మతం ప్రకారం క్రైస్తవుడు. అతడిని వన్నియార్ గా చిత్రీకరించడానికి చిత్ర నిర్మాతలు కావాలని..వన్నియార్ సంఘంతో ఉన్న agni kudam గుర్తుతో క్యాలెండర్ ను ఉంచారని తెలిపారు. ఇది వన్నియార్ సభ్యుల పరువు తీయడం..సంఘం యొక్క ప్రతిష్టను దెబ్బ తీయాలనే దుర్మార్గపు ఉద్ధేశ్యంతో జరిగిందని నోటీసుల్లో వెల్లడించింది.

Read More : Moderate Rains : తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు

ఇదే వివాదంపై నటుడు సూర్యకి మాజీ కేంద్ర మంత్రి పీఎంకే ముఖ్యనేత అన్బుమణికి ఓ లేఖను కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ…దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందని, అంతేగాని..సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరడం తమ ఉద్ధేశ్యం కాదన్నారు. కానీ..జై భీమ్ సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంలో నటుడు సూర్యకు దళిత పార్టీలు, అనేక సంఘాలు మద్దతు నిలుస్తున్నారు. నిజఘటనలో బాధితురాలిగా ఉన్న పార్వతి అమ్మాన్ పేరిట…రూ. 10 లక్షలు బ్యాంకులో వేసినట్లు వెల్లడించారు నటుడు సూర్య. దళితులకు బాసటగా నిలిచిన వామపక్షాల నేతలంటే తనకు ఎంతో గౌరవమని కూడా వ్యాఖ్యానించారు. మరి తాజాగా..నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.