Varalaxmi Sarath Kumar : నాకు ఆర్టిస్ట్ గా పేరు వచ్చింది తెలుగులోనే.. మొత్తానికి ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాను..

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా ఇప్పుడు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. గతంలో క్రాక్ సినిమాలో విలన్ గా మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాలో..............

Varalaxmi Sarath Kumar : నాకు ఆర్టిస్ట్ గా పేరు వచ్చింది తెలుగులోనే.. మొత్తానికి ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాను..

Varalaxmi Sarath Kumar about telugu industry

Varalaxmi Sarath Kumar :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుండగా ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి అలరించారు.

Gopichand Malineni : బాలకృష్ణకి డైరెక్టర్ మొదట వినిపించింది వీరసింహారెడ్డి స్టోరీ కాదట..

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా ఇప్పుడు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. గతంలో క్రాక్ సినిమాలో విలన్ గా మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాలో కూడా విలన్ గా, మంచిదానిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ని బాలకృష్ణ అభినందించారు. దీంతో కెరీర్ గురించి బాలకృష్ణ అడగగా వరలక్ష్మి మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా చేసినా పేరు వచ్చింది మాత్రం నెగిటివ్ రోల్స్ తోనే క్రాక్ సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ లా అనిపించింది. తెలుగు వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆర్టిస్ గా ఇక్కడి తెలుగు సినిమాలతోనే నాకు మంచి పేరు వచ్చింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి మెల్లిమెల్లిగా షిఫ్ట్ అయిపోతున్నాను అని చెప్పింది.