బాలకృష్ణతో వరలక్ష్మీ!

రీసెంట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన ఆడిపాడనుందని వార్తలొస్తున్నాయి..

  • Published By: sekhar ,Published On : May 11, 2019 / 11:15 AM IST
బాలకృష్ణతో వరలక్ష్మీ!

రీసెంట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన ఆడిపాడనుందని వార్తలొస్తున్నాయి..

జై సింహా తర్వాత నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో, సి.కళ్యాణ్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. హీరోగా బాలయ్యకిది 105వ సినిమా. లెజెండ్ తర్వాత జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య పక్కన ఆడిపాడనుందని వార్తలొస్తున్నాయి. పందెంకోడి-2, సర్కార్, మారి-2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వరలక్ష్మీ తమిళ్‌లో హీరోయిన్‌గానేకాక ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేస్తుంటుంది.

అయితేఈ సినిమాలో జగపతి బాబుతో పాటు వరలక్ష్మీది కూడా నెగెటివ్ క్యారెక్టరే అని తెలుస్తుంది. బాలయ్య సినిమాలో వరలక్ష్మీ నటించనుందనే వార్త గురించి యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాలకు సంగీతమందిచిన చిరంతన్ భట్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవలే బాలయ్య లుక్‌కి సంబంధించిన ఫోటో షూట్ పూర్తయింది. ఈ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. మే నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారు.