ఈ సినిమా చూడండి.. కరోనా అంటే ఏంటో తెలుస్తుంది..

కరోనా ఎఫెక్ట్ : అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్..

  • Published By: sekhar ,Published On : March 28, 2020 / 12:18 PM IST
ఈ సినిమా చూడండి.. కరోనా అంటే ఏంటో తెలుస్తుంది..

కరోనా ఎఫెక్ట్ : అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్..

కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా ‘కరోనా.. క్వారంటైన్.. ఐసోలేషన్’.. ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. చైనాలోని వూహాన్‌లో బయటపడిన కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కరోనా గురించి, వైరస్ వ్యాప్తి గురించి తెలియాలంటే ఓ హాలీవుడ్ మూవీ చూస్తే తెలుస్తుంది అంటుంది తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అచ్చం ఇలాంటి కథతోనే 2011లో ‘కాంటాజియన్’ ఓ సినిమా రిలీజ్ అయింది.
తొమ్మిదేళ్ల క్రితమే దాదాపు ఇలాంటి నేపథ్యంతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా నిండా వైరస్, దాని ప్రభావం, అది వ్యాప్తి చెందడం ఇలాంటి పదజాలమే. విడుదలైనపుడు ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ఆ సినిమా విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది ‘కాంటాజియన్’. తమిళ వరలక్ష్మి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించింది. వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని పేర్కొంది. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించింది. ‘‘ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారని భావిస్తున్నాను. నేనూ ఇంట్లోనే ఉంటున్నాను.

కరోనా వైరస్‌ మనకు సోకదు అని కొందరు భావిస్తున్నారు. అయితే, అది కరెక్ట్‌ కాదు. కరోనా ఎవరికైనా సోకవచ్చు. ‘కాంటేజెయన్‌’ అనే ఆంగ్లో సినిమా ఉంది. అది చూస్తే ఇలాంటి వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్ధమవుతుంది. కాగా, చుట్టు పక్కల పిల్లలు, వృద్ధులకు సహాయం చేయండి. అలాగే ఇళ్లు, దుకాణాల అద్దెలను ఈ నెల ఆలస్యంగా తీసుకుంటే మంచిది’’ అంటూ వీడియో విడుదల చేసింది వరలక్ష్మీ.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#coronaviruslockdown

A post shared by ???? ??????????? (@varusarathkumar) on