Varisu: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన వారిసు.. ఎప్పుడో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Varisu: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన వారిసు.. ఎప్పుడో తెలుసా?

Varisu Locks World Television Premiere Date

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

Varisu: వారిసు హిందీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

ఇటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక వారిసు చిత్రానికి థమన్ అందించిన పాటలు అదనపు బలంగా నిలిచాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సాంగ్స్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో తన సత్తా చాటింది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిన కొద్దిరోజులకే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. అందులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

Varisu: ఎట్టకేలకు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన వారసుడు!

వారిసు చిత్రాన్ని బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను తమిళ వర్ష‌న్‌లో ఏప్రిల్ 14న సన్ టీవీలో సాయంత్రం 6.30గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళనాట విజయ్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను బుల్లితెరపై వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఇఫ్పుడు ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.