Varisu: వారిసు హిందీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్ర యూనిట్ రూపొందించింది.

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
Varisu: ఎట్టకేలకు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన వారసుడు!
ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వారిసు చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కాయి. విజయ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘వారిసు’ చిత్రం నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?
దీంతో ఈ సినిమా హిందీ భాషలో ఎప్పుడెప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా అని విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తు్నారు. కాగా, తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. వారిసు చిత్రాన్ని హిందీలో మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమా హిందీ వర్షన్‌కు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారా అని మేకర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
no more holding back!
this ultimate entertainer now comes to you in Hindi?#VarisuOnPrime, Mar 8 in Hindi! #Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @vaishnavi141081 @Yugandhart_ pic.twitter.com/vayx8XjcMT— prime video IN (@PrimeVideoIN) February 22, 2023