Varisu: ఎట్టకేలకు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన వారసుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘వారసుడు’ అనే టైటిల్‌తో చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.

Varisu Makes OTT Debut
Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ‘వారసుడు’ అనే టైటిల్‌తో చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
Varisu : వారసుడు ఓటిటికి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో, ఎక్కడో తెలుసా?
ఇక విజయ్ పర్ఫార్మెన్స్‌కు అభిమానులు పట్టం కట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాకు మరింత బలాన్ని అందించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించి విజయ్ స్టామినా ఏమిటో చూపెట్టింది. అయితే, ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ వస్తు్న్నారు.
Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?
తాజాగా, వారిసు చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. హిందీ వర్షన్‌కు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. మరి వారిసు చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.