RGV: కొండా.. ఓ డైనమిక్ పర్సనాలిటీ.. అందుకే సినిమా

సినిమా అంటేనే వివాదం.. వివాదముంటేనే సినిమా చేస్తాననే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కొండా మురళి- సురేఖ దంపతులపై సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో 'రక్త చరిత్ర', వంగవీటి..

RGV: కొండా.. ఓ డైనమిక్ పర్సనాలిటీ.. అందుకే సినిమా

Rgv (2)

RGV: సినిమా అంటేనే వివాదం.. వివాదముంటేనే సినిమా చేస్తాననే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కొండా మురళి- సురేఖ దంపతులపై సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ‘రక్త చరిత్ర’, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇలా ఎన్నో వివాదాల తేనెతుట్టెని కదిపిన ఆర్జీవీ.. ఇప్పుడు ‘కొండా’ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారు. అక్టోబర్ 12న వరంగల్‌లో కొండా సురేఖతో కలిసి ర్యాలీ నిర్వహించి గ్రాండ్‌గా ‘కొండా’ మూవీని లాంచ్ చేశాడు వర్మ.

RGV: నా దృష్టిలో హీరోలే లేరు.. నా కథలో అంతకన్నా ఉండరు

ఎన్‌కౌంటర్‌లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం‌ గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు తెలుపుతూ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసిన వర్మ.. ఈ సినిమా ద్వారా 80, 90ల్లోని ల్యాండ్ లార్డ్స్ రాక్షసత్వాన్ని తెరమీద చూపించబోతున్నాడని వినిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలపై 10 టీవీ క్వశ్చన్ అవర్ లో మాట్లాడిన వర్మ.. కొండా మురళి, సురేఖ ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ఏ పార్టీలో ఉన్నారో తనకు అనవసరమని.. ఇంకా చెప్పాలంటే అసలు రాజకీయాలే ఇందులో ఉండవని.. కేవలం తన కథపై ఈ ఇద్దరూ మంచి ఇంపాక్ట్ కలిగిస్తారని చెప్పగలని చెప్పారు.

RGV: అమ్మాయిలంటే ఇష్టం.. లెస్బియన్స్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం!

ఇలాంటి వివాదాస్పద సినిమాలలో పేర్లు మార్చి రియల్ పాత్రలను సినిమాలో పెట్టడంపై కూడా స్పందించిన వర్మ.. తాను చేసేది లీగల్ గా కరెక్ట్ అనుకుంటున్నానని.. అందుకే అలా పెడతానని చెప్పారు. అసలు తన కథలు కూడా రియల్ కథలకు ఫిక్షన్ జోడించే చేస్తానని.. అందులో కొన్ని పాత్రలు కూడా తన ఆలోచనలో నుండే పుడతాయని.. కానీ మీడియా వాళ్ళే ఆ పాత్రలు వాళ్ళని.. వీళ్ళని పోలినట్లు ఉందని వాళ్ళ పేర్లు చెప్తారని.. కానీ తనకి అసలు వాళ్ళ అసలు పేర్లు కానీ.. వాళ్ళ పాత్రలు కూడా తెలియదన్నారు.